ఎన్నికలకోడ్ మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

ఎన్నికలకోడ్ మంత్రి జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ తనిఖీ

సూర్యాపేట శివారులో  వాహన సోదాలు చేసిన పోలీసులు
 
ముద్ర ప్రతినిధి సూర్యాపేట: రాష్ట్రంలో శాసనసభ ఎన్నికల నేపథ్యంలో పోలీసులు ముమ్మరంగా తనిఖీలను నిర్వహిస్తున్నారు. రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి కాన్వాయ్‌ని సూర్యాపేట  సమీపం లోని  విజయవాడ - హైదరబాద్ జాతీయ రహదారి పై చెక్ పోస్ట్ వద్ద శుక్రవారం పోలీసులు తనిఖీ చేశారు.ఎన్నికల నిబంధనలను అనుసరించి పోలీసులకు మంత్రి జగదీష్  రెడ్డి పూర్తిగా సహకరించారు. మంత్రి వాహనంతో పాటు ఆయన వెంట ఉన్న ఇతర వాహనాలను సైతం పోలీసులు చెక్ చేశారు. కార్ లోని డాష్ బోర్డ్ లను సైతం క్షుణ్ణంగా  తనిఖీ చేసి డబ్బు ఉందా? అంటూ ఆరా తీశారు. తమ వాహనం మొత్తం, వెంట ఉండి మరీ, పోలీసులకు చూపించారు. వాహన తనిఖీ అనంతరం మంత్రికి అధికారులు ధన్యవాదాలు తెలిపారు.