గుట్టు చప్పుడు కాకుండా చెరువు మట్టి  లూఠీ

  • గుట్టు చప్పుడు కాకుండా చెరువు మట్టి  లూఠీ
  • మట్టి కోసం చెరువు నీరు విడుదల... నీరంతా వృధా
  • ఇటుక బట్టి ల కోసం చెరువు మట్టి తీస్తున్న ఇటుక మాఫియా
  • అధికారులను కూడా భయబ్రాంతులకు గురి చేస్తున్న ఇటుక మాఫియా
  • పశువుల కు కూడా నీరు దొరకని వైనం
  • జేసిబి ల తో చెరువు లో మట్టి తవ్వకాలు
  • మట్టి దందా కొనసాగుతున్న కన్నెత్తి చూడని అధికారులు
  • దేవాలయం భూముల్లో ఇటుక సామ్రాజ్యం
  • పచ్చని పొలాల్లో వెచ్చని మంటలు
  • మట్టి మాఫియాను,ఇటుక సామ్రాజ్యం ను కొల్లగొట్టేది ఎవరు❓
  • అధికారులు ఆ మాఫియా ఎంటే ఎందుకు జనుకుతున్నారు
  • ఇటుక,మట్టి మాఫియా గాళ్ళకు అధికారులు అంటే భయం లేదా❓
  • ఫిర్యాదు చేసిన పట్టింపేది


హుజుర్ నగర్  ముద్ర :-సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ మండలం బూరు గడ్డ గ్రామం లో నిండు కుండలా ఉన్న నల్ల చెరువు నీళ్లను వృధాగా వదిలారు.దీనితో చెరువు అంతా ఖాళీ అయిపోయింది..దీనిని ఆసరాగా చేసుకున్న కొందరు మట్టి మాఫియా జె.సి.బి మిషన్ల సహాయం తో మట్టిని తీసి ట్రాక్టర్ల ద్వారా  గోపాల పురం లోని ఇటుక బట్టిలకు తరలిస్తున్నారు.ఇంత దందా కొనసాగుతున్న అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

గ్రామం లో నీటి ఎద్దడి

గ్రామం లో చెరువు నిండు కుండలా ఉన్నప్పుడు బావుల్లో బోర్లలో నీరు సంవృద్దిగా ఉన్నాయి..మట్టి కోసం చెరువు నీళ్ళు వదలడం తో భూ గర్బ జలాలు ఇంకి పోయి బోర్ల లో బావుల్లో నీళ్ళు అడుగంటాయి..దీనితో గ్రామం లో నీటి ఎద్దడి ఏర్పడిందని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు.మిషన్ భగీరథ నీళ్ళు కూడా రావడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు..

దేవుని మాణ్యం భూముల్లో ఇటుక బట్టీలు

బూరుగడ్డ  శ్రీ శాల్మలి కంద ఆది వరాహ లక్ష్మీ నరసింహ  వేణుగోపాల   స్వామి ఆలయం కు దేవుని మాన్యం భూములు 588 ఎకరాల 17 కుంటలు కలదు.దీనిని గోపాలపురం,హుజూర్ నగర్  కు చెందిన కొందరు రైతులు సేద్యం చేసుకోవడానికి దేవాలయం నుండి కౌలుకు తీసుకున్నారు..కౌలు తీసుకున్న రైతులు కొందరు. మూడేండ్ల నుండి కౌలు కూడా చెల్లించడం లేదని దేవాదాయ శాఖ అధికారులు చెబుతున్నారు.విశేషం ఏమిటంటే కౌలు కు తీసుకున్న రైతులు ఏడాది లో రెండు పంటలకు కౌలు చెల్లించేది కేవలం నాలుగు వేలు మాత్రమే...అంటే ఒక పంటకు రెండు వేలు అన్న మాట.కొందరు రైతులు కౌలు కు తీసుకొని భూమి సేద్యం చేయకుండా వ్యవసాయేతర భూమి గా మార్చి కమర్షియల్ గా ఇటుక బట్టి లు పెట్టీ జోరుగా ఇటుక సామ్రాజ్యాన్ని నెలకొల్పారు.ఈ ఇటుక  మాఫియా ఇటుకలను తెలంగాణ,ఆంధ్ర  కు ఎగుమతి చేస్తూ లాభాలు గడిస్తున్నారు..

రోడ్ల పక్కనే బట్టీలు

కోదాడ  మిర్యాల గూడ జాతీయ రహదారి వెంట గోపాల పురం గ్రామం ఉంది.. ఈ గ్రామం దాదాపు దేవాలయం భూముల్లో నే ఉంది.గ్రామం లో ఇరుపక్కలా జాతీయ రహదారి వెంట ఇష్టo వచ్చినట్లు ఇసుక సామ్రాజ్యం ను ఏర్పాటు చేశారు.రోడ్డుకు ఇరుపక్కలా ఇటుక బట్టీలు ఏర్పాటు చేయడం తో  బట్టీల నుండి వచ్చే బూడిద వచ్చి పోయే వాహన దారుల కండ్ల లో పడి ప్రమాదాలకు గురి అయ్యే పరిస్థితి ఏర్పడింది.అంతే కాకుండా ప్రసిద్ది గాంచిన శ్రీ అభయాంజనేయ దేవస్థానం కలదు..ఆలయం కు వచ్చే భక్తులు తీసుకునే తీర్థ ప్రసాదాలు లో ఈ ఇటుక బట్టీల బూడిద పడుతోందని భక్తులు ఆరోపిస్తున్నారు.వ్యవసాయ భూముల ను కమర్షియల్ గా ఇటుక బట్టీల వ్యాపారం బహిరంగంగా జరుగుతున్న దేవాదాయ అధికారులు ఎందుకు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఇదంత దేవాద్యశాఖ అధికారుల కనుసన్నలలో నే ఇటుక వ్యాపారం జరుగుతోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

మట్టి ఎక్కడ నుండి వస్తోంది

ఇటుక బట్టీలకు మట్టి ఎక్కడ నుండి వస్తోందని ప్రభుత్వం ఆదాయానికి గండి కొట్టి ప్రభుత్వం భూముల్లో ఉన్న మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు అని  ఇంత తంతు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని నెల నెల సంబంధిత అధికారులకు భారీగా ముడుపులు అప్పజెప్పు తున్నరన్న ఆరోపణలు గుప్పుమంటున్నాయి.ఇప్పటికీ అయిన అధికారులు ఇటుక బట్టీలు ఏర్పాటు చేసిన కౌలు భూములను స్వాధీనం చేసుకోవాలని, చెరువు లో అక్రమ మట్టి తోల కాలను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు...