ఓటు హక్కును వినియోగించుకున్న శిరీష అలియాస్ బర్రెలక్క

ఓటు హక్కును వినియోగించుకున్న శిరీష అలియాస్ బర్రెలక్క

ముద్ర.కొల్లాపూర్: కొల్లాపూర్ నియోజక వర్గం ఎమ్మెల్యేగా స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తున్న నిరుద్యోగ యువతీ శిరీష అలియాస్ బర్రెలక్క తన ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారు. నియోజకవర్గంలోని పెద్దకొత్తపల్లి మండలం తన స్వగ్రామమైన మరికల్ లో శిరీష అలియాస్ బర్రెలక్క ఓటు వేశారు. రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరారు. శిరీష అలియాస్ బర్రెలక్క నిరుద్యోగుల తరఫున ఎమ్మెల్యేగా నామినేషన్ వేసి రాష్ట్రంలో ఓ గుర్తింపును తెచ్చుకున్నది. బర్రెలక్క ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం నియోజకవర్గం లోని వివిధ గ్రామాలలో పర్యటిస్తూ పోలింగ్ సరళిని పరిశీలిస్తుంది.