ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా..

ఎల్లప్పుడూ పార్టీ కార్యకర్తలకు అండగా ఉంటా..

కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంట...

మా పార్టీ కార్యకర్తల జోలికి ఎవరైనా వస్తే ఊరుకునేది లేదు..

కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను అమలు చేసే విధంగా వారిపై వొత్తిడి తేవాలి..

మాజీ శాసన సభ్యులు మర్రి జనార్ధన్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి నాగర్ కర్నూల్ జిల్లా: రాబోయే పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ఈరోజు నాగర్ కర్నూల్ జిల్లా కేంద్రంలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన తిమ్మజిపేట్, తాడూర్ మండలాల సంబందించిన పార్టీ నాయకులతో,కార్యకర్తలతో సమీక్ష సమావేశం నిర్వహించారు, ఈ సమావేశానికి మాజీ శాసన సభ్యులు శ్రీ మర్రి జనార్దన్ రెడ్డి గారు,BRS రాష్ట్ర కార్యదర్శి బైకాని శ్రీనివాస్ యాదవ్ గారు,,పార్టీ నాయకులు నాగం శశిధర్ గారు,హాజరైనారు.ఈ సంద్భంగా మర్రి మాట్లాడుతూబీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే కథానాయకులుకార్యకర్తల వల్లే ఇన్నేళ్ళుగా పార్టీ బలంగా ఉంది 


కేసీఆర్ పై ప్రజల్లో సానుభూతి వెల్లువలా ఉంది.. ఈ పరిస్థితిని పార్లమెంటు ఎన్నికల్లో సానుకూలంగా మలచుకోవాలి 
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి
పార్టీకి ప్రభుత్వానికి సమన్వయం లేకపోవడం వల్లే ఇలాంటి పరిస్థితి ఎదురైందని కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు
సోషల్ మీడియాలో జరిగిన అసత్య ప్రచారాన్ని మనం గట్టిగా తిప్పికొట్టలేకపోయాం 
అవతలి వాళ్లు అభూత కల్పనలు, అబద్దాలతో ప్రజలను తప్పుదోవ పట్టించారు 
మనం ఇంకా మాట్లాడటం మొదలు పెట్టనే లేదు.. కాంగ్రెస్ వాళ్ళు ఉలికి పడుతున్నారు 
కేసీఆర్ అసెంబ్లీకి వస్తే ఇంకెలా ఉంటుందో ఉహించుకోండి 
అధికారంలోకి వస్తామని కాంగ్రెస్ వాళ్లు కూడా కలగన లేదు. అందుకే ఇష్టమొచ్చినట్టు హామీలు గుప్పించారు 
హామీలకు కాంగ్రెస్ పంగనామాలు పెట్టె ప్రయత్నం చేస్తోoది.. అయినా వదిలి పెట్టం కార్యకర్తలు ఉదాసీన వైఖరి మీమాంస వీడాలి.. ఎన్నికల్లో కాంగ్రెస్ నేతలు ఏం మాట్లాడారు కార్యక్రమంలో కార్యకర్తలు పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు..