మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ - ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి

ముద్ర నేరేడుచర్ల : మున్సిపాలిటీల అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపుతున్నట్లు  హుజూర్నగర్ శాసనసభ్యులు శానంపూడి సైదిరెడ్డి అన్నారు. శుక్రవారం సాయంత్రం నేరేడుచర్ల లో రూ 80 లక్షలతో నిర్మించనున్న సిసి రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన సందర్భంగా మాట్లాడారు. మేజర్ గ్రామ పంచాయతీగా ఉన్న నేరేడుచర్లను మున్సిపాలిటీగా ఏర్పాటు చేసి అన్ని వసతులు సమకూరే విధంగా అభివృద్ధి పనులు చేపట్టినట్లు తెలిపారు. అన్ని ప్రధాన రహదారులను విస్తరించి డ్రైనేజీల నిర్మాణాలు సెంట్రల్ లైటింగ్ ఏర్పాటు చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రధాన రహదారులతో పాటు అంతర్గత రహదారులు సిసి రోడ్ల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించినట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పట్టణాల అభివృద్ధికి గతంలో ఏ ప్రభుత్వం మంజూరు చేయని విధంగాఅత్యధిక నిధులు మంజూరు చేసిందని తెలిపారు. పట్టణంలో క్రీడా ప్రాంగణం,స్మశాన వాటికల నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు.

ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ చందమల్ల జయ బాబు, కౌన్సిలర్లు అలక సరిత, షేక్ బాషా,షేక్ షహనాజ్, లలిత భరత్, తాళ్లూరు సాయి, వేముల నాగవేణి,డిసిసిబి డైరెక్టర్ దొండపాటి అప్పి రెడ్డి, మార్కెట్ కమిటీ చైర్మన్ నాగండ్ల శ్రీధర్, రైతు సమన్వయ సమితి మండల చైర్మన్ కొణతం సత్యనారాయణ రెడ్డి, గ్రంధాలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ గుర్రం మార్కండేయ, మత్స్య సహకార సంఘ చైర్మన్ యామిని వీరయ్య, మండల పరిషత్ వైస్ ఎంపీపీ తాళ్లూరు లక్ష్మీనారాయణ, మండల బి ఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు అరిబండి సురేష్ బాబు,పట్టణ ప్రధాన కార్యదర్శి చిత్తలూరు పెద్ద సైదులు, పట్టణ మహిళా అధ్యక్షురాలు కట్ట కళావతి, సహకార సంఘ చైర్మన్లు శాఖమూరి శ్రీకాంత్ , అనంత్ శ్రీనివాస్ గౌడ్ ,కల్లూరు సర్పంచ్ పల్లె పంగు నాగరాజు, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ వల్లంశెట్ల రమేష్ బాబు,మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి, మేనేజర్ అశోక్ రెడ్డి, ఆకారపు వెంకటేశ్వర్లు , కుంకు శ్రీనివాసరావు, సైదిరెడ్డి,సులువ యాదగిరి, తదితరులు పాల్గొన్నారు.