వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ చేయూత

వృద్ధాశ్రమానికి వాసవి క్లబ్ చేయూత

ముద్ర నేరేడుచర్ల: దురాజ్ పల్లి లోని అన్నపూర్ణ చారిటబుల్ ట్రస్ట్ పేరుతో అనాధ వృద్ధుల , మానసిక వికలాంగుల ఆశ్రమం నిర్వహిస్తున్న నిర్వాహకులకు శుక్రవారం వాసవీ వనితా క్లబ్ లు సంయుక్తంగా  నిత్యావసర సరుకులను , దుస్తులను పంపిణీ చేసి చేయూతనందించారు. 50 కేజీల బియ్యం , చీరలు దుప్పట్లు , పండ్లు , కూరగాయలు , పశువులకు దాణా అందజేసినట్లు వనితా క్లబ్ అధ్యక్షురాలు వీరవల్లి శ్రీలతా కోటేశ్వరరావు శుక్రవారం తెలిపారు. ఇదే సందర్భంగా సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య ఆర్థిక సహకారంతో నిరుపేద విద్యార్థికి 25వేల రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందజేశారు.  విశాల సేవా దృక్పథం, మహోన్నత భావాలు కలిగిన   సూర్యాపేట జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు ఇమ్మడి సోమ నరసయ్య కు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో 
వాసవీ వనితా క్లబ్ ప్రధాన కార్యదర్శి  పోలిశెట్టి సంధ్య ,
 కోశాధికారి యీగా భాగ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.