మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ

మల్లికార్జున స్వామి ఉత్సవాల్లో ప్రత్యేక పూజలు చేసిన ఎమ్మెల్సీ


సారంగాపూర్ ముద్ర: సారంగాపూర్ మండలంలోని అర్పపల్లి గ్రామంలోని అటవీ ప్రాంతంలో గల శ్రీ మల్లికార్జున స్వామి శ్రీ రాజరాజేశ్వర స్వామి జాతర ఉత్సవాల్లో కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఈ జీవన్ రెడ్డి ప్రత్యేక పూజలు చేశారు. గత వారం రోజులుగా జరుగుతున్న జాతర ఉత్సవాలు లో భాగంగా చివరి రోజైన బుధవారం నాగవెల్లి పండుగను ఆలయ పూజారులు ఘనంగా నిర్వహించారు.

ఈ సందర్భంగా భక్తులకు ఆలయ వర్గాలు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వెంట కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు కొండ్ర రామచంద్ర రెడ్డి, మాజీ సర్పంచ్ భోగ గంగాధర్,నాయకులు ఆకుల రాజిరెడ్డి, అప్ప స్వామి, బేర మహేష్, ఆలయ అర్చకులు పాల్గొన్నారు.