తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్  డాక్టర్  పిడమర్తి రవికి కేటాయించాలి

తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్  డాక్టర్  పిడమర్తి రవికి కేటాయించాలి
  • మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మీసాల మహేష్
  • ఓయూ విద్యార్థి జేఏసీచైర్మన్
  • మిట్ట గడుపుల రమేష్

తుంగతుర్తి ముద్ర: తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉస్మానియా యూనివర్సిటీ ఓయూ జేఏసి ఫౌండర్ డాక్టర్ పిడమర్తి రవికి తుంగతుర్తి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వాలని మాదిగ విద్యార్థి జేఏసీ రాష్ట్ర కన్వీనర్ మీసాల మహేష్ అలాగే ఓయూ విద్యార్థి జేఏసీ చైర్మన్ మిట్టగడుపుల రమేష్ లు వేరువేరు ప్రకటనలోకాంగ్రెస్ పార్టీ అధిష్టానాన్ని కోరారు .

ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తుంగతుర్తి ప్రాంతం రాజకీయంగా చైతన్యం ఉన్న ప్రాంతమని తెలంగాణ ఉద్యమంలో ప్రధాన పాత్ర పోషించిన పిడమర్తి రవి తుంగతుర్తి ప్రాంతం నుండి ఎన్నికల బరిలోకి దిగితే విజయం ఖాయమని అన్నారు .ఉద్యమ సమయంలో సుమారు 182 కేసులలో పలుమార్లు అరెస్టై జైలుకెళ్లి తెలంగాణ  సాధనలో ప్రధాన భూమిక పోషించిన పిడమర్తి రవికి తుంగతుర్తి ప్రాంతం పై అవగాహన ఉందని ఈ ప్రాంత ప్రజలు కూడా పిడమర్తిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారని వారు అన్నారు. కుల మత ప్రాంత భేదాలు లేకుండా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పిడమర్తి రవిని గెలిపించడానికి ప్రజలు ఉత్సాహం చూపుతున్నారని అన్నారు. తుంగతుర్తి ప్రాంతం అభివృద్ధి చెందాలంటే సమస్యలపై అవగాహన కలిగిన వ్యక్తి ఉండాలని ఉన్నత చదువులు చదివిన పిడమర్తి రవి ఈ ప్రాంత అభివృద్ధికి కృషి చేయగలరని వారన్నారు కాంగ్రెస్ పార్టీ అధిష్టానం తుంగతుర్తి అసెంబ్లీ స్థానాన్ని పిడమర్తి కేటాయించాలని వారు విజ్ఞప్తి చేశారు.