గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

గుర్తు తెలియని మహిళ అనుమానాస్పద స్థితిలో మృతి

ముద్ర ప్రతినిధి సూర్యాపేట: గత నెల 30వ తేదీన  కుడ-కుడ రోడ్ లో ఉన్న పెట్రోల్ బంక్ దగ్గర ఒక గుర్తు తెలియని మహిళ వయస్సు అందాజ 40-45 సం. రాలు వంకాయ రంగు చీర, ఎర్ర రంగు జాకెట్ దరించి ఉండి వాంతులు చేసుకొని అపస్మారక స్థితి లో రోడ్ సైడ్ పడి ఉండగా అక్కడ ఉన్న పబ్లిక్ చూసి 108  ఫోన్ ద్వారా తెలియజేయడంతో గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ కు సూర్యాపేట కి చికిత్స కోసం తరలించడం జరిగిందని, చికిత్స పొందుతూ గురువారం మధ్యాహ్నం ఆ మహిళ మరణించిందని పట్టణ సీఐ రాజశేఖర్ తెలిపారు. ఎవరైనా మహిళలకు సంబంధించిన వారు ఆచూకీ తెలిస్తే సూర్యాపేట  పట్టణ పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఆయన సూచించారు.