నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు

నామినేషన్ల స్వీకరణకు పకడ్బందీ ఏర్పాట్లు
  • అభ్యర్థితో పాటు నలుగురికి అవకాశం..
  • అభ్యర్థులకు ఫెసిలిటేషన్ సెంటర్లు..
  • కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి ఎస్ వెంకట్రావు.

ముద్ర ప్రతినిధి సూర్యాపేట : నాలుగు నియోజకవర్గాల ఆర్వో కార్యాలయాలలో నామినేషన్ల స్వీకరణకు పొగడ్బందీ ఏర్పాట్లు చేయాలని  కలెక్టర్ జిల్లా ఎన్నికల అధికారి వెంకట్రావు తెలిపారు.  జిల్లా ఎస్పీ రాహుల్ హెగ్డే ,జిల్లా ఆదనపు కలెక్టర్ సిహెచ్ ప్రియాంక తో కలిసి వెబేక్స్  వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆర్ వో లు, ఏఆర్వోలు, పోలీసు సిబ్బందితో నామినేషన్స్ స్వీకరణ ఏర్పాట్లపై కాన్ఫరెన్స్ నిర్వహించారు. 
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నవంబర్ 3 నుండి అసెంబ్లీ ఎన్నికల కొరకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. నామినేషన్ల ప్రారంభ రోజు  నుండి ముగిసే వరకు ఆర్వో కార్యాలయం వద్ద  100 మీటర్ల వరకు మార్కింగ్ చేయాలని తెలిపారు. ఆర్వో కార్యాలయాలలో నామినేషన్ పక్రియ మొత్తం వీడియో రికార్డింగ్ చేయాలని కలెక్టర్ తెలిపారు. అభ్యర్థుల సమర్పించిన నామినేషన్ పత్రాలను క్షుణ్ణంగా ముందే పరిశీలించాలని కలెక్టర్ అన్నారు. హెల్ప్ డెస్క్ కూడా ఏర్పాటు చేయాలన్నారు. నామినేషన్స్ ,ఆఫిడవిట్ పత్రాలను మేనొయువర్ క్యాండిడెట్ కెవైసి యాప్ నందు అప్లోడ్ చేయాలన్నారు.
 ఈ వీడియో కాన్ఫరెన్స్ లో అడిషనల్ ఎస్పీ నాగేశ్వరరావు, ఆర్వోలు వీర బ్రహ్మచారి, జగదీశ్వర్ రెడ్డి, సూర్యనారాయణ, డీఎస్పీ నాగభూషణం, రాములు, తాసిల్దారులు, ఎలక్షన్స్ సిబ్బంది పాల్గొన్నారు.