బి. ఆర్. ఎస్.  ఎమ్మెల్యే పర్యటనలో గ్రామస్తుల నిరసన

బి. ఆర్. ఎస్.  ఎమ్మెల్యే పర్యటనలో గ్రామస్తుల నిరసన

కారేపల్లి, ముద్ర : వైరా శాసనసభ్యులు రాములు నాయక్ సోమవారం ఖమ్మం జిల్లా కారేపల్లి మండలంలో పర్యటించారు.  కారేపల్లి సంత వెంకటేశ్వర స్వామి ఆలయానికి నూతన చైర్మన్ అడ్డగోడ ఐలయ్య కమిటీ ప్రమాణ స్వీకారంలో పాల్గొన్నారు. అనంతరం ఆయన 'మన పల్లెకు మన ఎమ్మెల్యే' కార్యక్రమం లో మండలం లోని  దుబ్బ తండ గ్రామంలో పర్యటనకు వచ్చారు. భారత రాష్ట్ర సమితి పార్టీ జెండాను ఆవిష్కరించి పాదయాత్రగా ముందుకు సాగారు.  పార్టీ ప్రవేశపెట్టిన పథకాలు గురించి ప్రజల కు వివరించారు. తమ గ్రామానికి ఎం చేయలేదని పలువురు గ్రామస్తులు ఎమ్మెల్యే పర్యటనలో నిరసన వ్య్వక్తం చేశారు. గెలిచి నాలుగు సంవత్సరాలు దాటిన తమ గ్రామం వైపు చూడలేదని , రోడ్లు, విద్యుత్, సమస్యలు పరిష్కరించలేదని మండిపడ్డారు. 'చెట్టు మీద కొంగ .. రాములు నాయక్ దొంగ' అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నాయకులు సర్ది చెప్పడంతో వివాదం తాత్కాలికంగా సద్దుమణిగింది.