ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు అధోగతే

ఓటును అమ్ముకుంటే ఐదేళ్లు అధోగతే

ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టి కాంగ్రెస్ ను గెలిపించండి
తెలంగాణలో అధికారం కాంగ్రెస్ దే..
ప్రచారం లో కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: ఈ ఎన్నికల్లో  బీఆర్ఎస్, బీజేపీ అభ్యర్తులు చూపే డబ్బు ఎరకు ఆశపడితే - మరో ఐదేళ్ల పాటు మోసపోవడం ఖాయమని కరీంనగర్ కాంగ్రెస్ అభ్యర్థి పురుమల్ల శ్రీనివాస్ ప్రజలకు విన్నవించారు. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వస్తుందని,  ఆరు గ్యారెంటే పథకాలను అమలు చేస్తుందని, కరీంనగర్ లో  గెలుస్తున్నామని శ్రీనివాస్ అన్నారు. నిబద్ధత, సమర్థత కలిగిన అభ్యర్థిని నన్ను ఎన్నుకోవాలని సూచించారు.  ఎన్నికల ప్రచారం లో భాగంగా మొద్దుంపూర్,మందులపల్లి, ఇరుకుల్ల గ్రామాలలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా పురుమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ  చేతి గుర్తుకు ఓటు వేయాలన్నారు 'ధనస్వామ్యాన్ని బద్దలు కొట్టండి - ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టండి'  ఓటు అమ్ముకోవద్దన్నారు. కరీంనగర్ లో  బీఆర్ఎస్ అభ్యర్థి గంగుల కమలాకర్ ఓటుకు రూ.10వేలు, సెల్ఫోన్, ప్రతి మహిళ కు పావులేత్తు బంగారం, వెండి ఆభరణాలు ఇస్తున్న తీరును, ధనప్రలోభాన్ని, ఓట్ల కొనుగోలును ఎండగట్టాడు.

 ప్రజాస్వామ్య పరిరక్షణపట్ల ఓటర్ల బాధ్యతను చాటిచెపుతూ  స్వచ్చందంగా ముందుకు వచ్చి కాంగ్రెస్ వైపు ఉన్నారని అన్నారు. నోటుకి ఐదేళ్ల భవిష్యత్తుని అమ్ముకోవద్దన్నారు. బీఆర్ఎస్, బీజేపీ నాయకులు పోస్తున్న మద్యానికీ, పడేస్తున్న నోటుకీ ఓటుని అమ్ముకో వద్దన్నారు. ప్రజాస్వామ్యం ధనస్వామ్యంగా మారిపోయిన ఇలాంటి వికృత వ్యవస్థ కోసమా గాంధీ, నెహ్రూ, ఇందిరమ్మ,రాజీవ్ గాంధీ,వంటి మహనీయులు జీవితాలు అర్పించింది అని ఆయన ప్రశ్నించారు. అందుకేనా సోనియా అమ్మ తెలంగాణ ఇఛ్చింది  అన్నారు. బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు కరీంనగర్  నియోజకవర్గంలో గెలుపుకోసం కోట్లకు కోట్లు డబ్బుని ఎరగా వేస్తుంటే, ప్రజలు, ఓటర్లు మాత్రం కాంగ్రెస్ వైపు, పురుమల్ల శ్రీనివాస్ వైపు ఉన్నారని అన్నారు. వారిచ్చే డబ్బులు, ధనం మీవే నని, మీ నుండి దొసుకున్న డబ్బులుతిరిగి నీకే ఇస్తున్నారని అన్నారు. వారిచ్చే డబ్బులు, ధనం తీసుకుని చేతి గుర్తుకు ఓటేసి గెలిపించాలని కోరారు. డబ్బు ప్రలోభానికి  ఎర వేసి  బీజేపీ, బీఆర్ఎస్ అభ్యర్థులు హీనమైన స్థితిలో  మళ్ళీ అధికారం కోసం   ఆరాటపడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో మండల అధ్యక్షులు కాంరెడ్డి రాంరెడ్డి,బ్లాక్ కాంగ్రెస్ సాయిని తిరుపతి, సీనియర్ నాయకులు మైలారం నాగరాజు, మైలారం శ్రీనివాస్,వంగల నిరంజన్, తగరు ఎల్లారెడ్డి, కొమ్మిడి రాఘవ రెడ్డి, కాలువ మల్లయ్య, గంగయ్య,సాయిలు, నాయకులు, కార్యకర్తలు,గ్రామప్రజలు పాల్గొన్నారు.