అఘాయిత్యానికి యత్నించిన వ్యక్తిని రాడ్ తో కొట్టి చంపిన మహిళ | Woman killed a man in Rangareddy

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి : రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బుద్వేల్ గ్రామం రజక వాడ బస్తిలో దారుణం చోటు చేసుకుంది. మద్యం మత్తులో మహిళను రేప్ చేయడానికి వచిన వ్యక్తిని రాడ్ తో కొట్టి  హత్య చేసింది. శుక్రవారం తెల్లవారుజామున తప్పతాగి తన ఇంటి తలుపులు కొట్టిన శ్రీనివాస్ అనే వ్యక్తి. ధీంతో తలుపులు తెరవగానే ఇంట్లోకి ప్రవేశించి బలవంతంగా జయమ్మ పై అఘాయిత్యానికి యత్నించాడు. ధీంతో ప్రతిఘటించి జయమ్మ  బయటకు పరుగులు తిసింధీ. I కాని శ్రీనివాస్ వదలకపోవటంతో పక్కనే ఉన్న ఇనుప రాడ్ తో తలపై బాధింది., దింతో స్పాట్ లో కుప్పకూలి తీవ్ర రక్త స్రావమై శ్రీనువాస్ ప్రాణాలు విడిచాడు. 

స్థానికుల అందించిన సమాచారం మేరకు సంఘటన స్థలానికి చేరుకున్న రాజేంద్రనగర్ పోలీసులు , కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు. కాగా భర్త బాలయ్య తో కలిసి రాజేంద్రనగర్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయిన జయమ్మ. తెల్లవారుజామున 4 గంటల సమయంలో ఘటన. మృతదేహాన్ని ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.