13 వందల కోట్లతో అభివృద్ధి పనులు

13 వందల కోట్లతో  అభివృద్ధి పనులు
  • అభివృద్ధి బాటలో విలీన గ్రామాల డివిజన్లు 
  • మేయర్ వై సునీల్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్ : నగరంలో 13 వందల కోట్ల అభివృద్ధి పనులు కొనసాగిస్తూ ప్రజలు నమ్మకాన్ని వమ్ము చేయకుండా  సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని  నగర ప్రథమ పౌరుడు యాదగిరి సునీల్ రావు అన్నారు. కరీంనగర్ అభివృద్ధి లో భాగంగా బుదవారం రోజు మేయర్ యాదగిరి సునీల్ రావు 20,56 డివిజన్లలో పర్యటించారు. మొదటగా 20 వ డివిజన్ ఆరెపల్లి విలీన గ్రామ ప్రాంతంలో స్థానిక కార్పోరేటర్ తుల రాజేశ్వరి, బాలయ్యతో కలిసి వివిధ కాలనీల్లో నగరపాలక సంస్థ కు చెందిన 1.51 కోట్ల రూపాయల నిధులతో  5 చోట్ల సీసీ రోడ్లు, డ్రైనేజీ లు, మంచినీటి పైపులైన్, ఎస్ డబ్లుజీ డ్రైనేజీ పైపులైన్ పనులకు భూమీ పూజ చేసి ప్రారంభించారు. డివిజన్ లోని పలు కాలనీలలో పర్యటించి స్థానిక మహిళలు , ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకొని వాటిని తనిఖీ చేసి పరిశీలించారు. అనంతరం 56 వ డివిజన్ బాగ్యనగర్ లో స్థానిక కార్పోరేటర్ వంగపల్లి రాజేంధర్ రావుతో కలిసి  మంచి నీటి లో ప్రెషర్ సమస్య పరిష్కారం లో భాగంగా నగరపాలక సంస్థ 15 లక్షల నిధులతో నూతన మంచి నీటి పైపు లైన్ పనులకు భూమీ పూజ చేసి పనులు ప్రారంభించారు. చేపట్టిన పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సౌకర్యాలు కల్పించాలని అధికారులు, కాంట్రాక్టర్లను ఆదేశించారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ మంత్రి గంగుల కమలాకర్, ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ సహకారంతో నగర అభివృద్ధికి నిధుల కొరతలేదన్నారు. 

తద్వారా నగర వ్యాప్తంగా అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ప్రస్తుతం నగర వ్యాప్తంగా 13 కోట్ల తో అభివృద్ధి పనులు నిరంతర ప్రక్రియగా కొనసాగుతున్నాయని తెలిపారు. రాబోయే 6 మాసాల్లో చేపట్టిన అభివృద్ధి పనులన్ని పూర్తి చేసి డివిజన్లలో ప్రజల సమస్యలు పరిష్కరిస్తామని తెలిపారు. నగర ప్రజలు సంతోషంగా జీవించేలా కావల్సిన మౌలిక సదుపాయాలు కల్పించి కరీంనగర్ ను గొప్ప నగరంగా తీర్చిదిద్దుతున్నామని అన్నారు. ఆరెపల్లి ప్రాంతం గతంలో గ్రామపంచాయతి పరిదిలో ఉండి నగరపాలక సంస్థ లో విలీన మైన డివిజన్  అభివృద్ధి కి నోచుకోక చాలా సమస్యలు తిష్టవేసాయన్నారు. వీటన్నిటీని పరిష్కరించడంలో భాగంగా డివిజన్ అభివృద్ధి కోసం ఇప్పటి వరకు 10 కోట్ల రూపాయల నిధులు కేటాయించి దశల వారిగా అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. మరో కోటిన్నర నిధులతో ఈ రోజు పలు అభివృద్ధి పనులకు భూమీ పూజ చేశామన్నారు. 

సమస్యలు పరిష్కరించడంలో పాలకవర్గం ఎప్పుడైన ముందంజలో ఉంటుందని తెలిపారు. 56 డివిజన్ లో కూడ సంతోష్ నగర్ నుండి వరద నీటి సమస్య గతంలో ఉండేదని ఆ సమస్యను కూడ నిదులకు వెనుకాడకుండ పరిష్కరించామన్నారు. అంతే కాకుండా చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న సెంజన్ స్కూల్, లేబర్ అడ్డ, సాయిబాబ టెంపుల్ రోడ్లతో పాటు డివిజన్ లోని అంతర్గత రోడ్లన్నిటీని పూర్తి చేశామని తెలిపారు. నగరం నడి మద్యలో ఉన్న డివిజన్ కాబట్టి ఎలాంటి సమస్యలు ఉండకుండ ఇచివలే మరో 2.50 కోట్ల రూపాయల నిధులు కూడ కేటాయించామని తెలిపారు. ఆ నిధులతో మిగితా పెండింగ్ పనులను కూడ త్వరలోనే ప్రారంభం చేస్తామన్నారు. నగరపాలక సంస్థ పరిదిలో 8 విలీన గ్రామాల డివిజన్లు, శివారు ప్రాంతాల డివిజన్ల పై దృష్టి పెట్టి అన్ని డివిజన్లలో అభివృద్ధి పనులు చేస్తున్నామని తెలిపారు. . ఈ కార్యక్రమంలో కో ఆప్షన్ మెంబర్ అజిత్ రావు, ఈఈ మహేందర్, డీఈ వెంకటేశ్వర్లు, వర్క్ ఇన్ స్పెక్టర్లు, డివిజన్ ప్రజలు పాల్గొన్నారు.