లోక్ అదాలత్ లో 1563 కేసులు పరిష్కారం

లోక్ అదాలత్ లో 1563 కేసులు పరిష్కారం

ముద్ర ప్రతినిధి, మెదక్: మెదక్ జిల్లా కోర్టు ప్రాంగణంలో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించగా మొత్తం 1563 కేసులు పరిష్కరించారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి పి. లక్ష్మీ శారద  ఆధ్వర్యంలో నిర్వహించారు.  1563 కేసులు పరిష్కరించగా అమౌంట్ 2కోట్ల 12 లక్షల 67 వేల 784 రూపాయలు  ఆక్సిడెంట్ కేసులలో నష్టపరిహారము, ఇన్సూరెన్స్  చెల్లించారు.  పిఎల్సి బ్యాంక్ రికవరీ కేసులలో రికవరీ చేయబడినది. భార్య భర్తల, క్రిమినల్,
సివిల్ కేసులు పరిష్కరించారు.

లోక్ అదాలత్ లో  న్యాయమూర్తులు సిహెచ్. జితేందర్, రీటా  లాల్చంద్, బి. కల్పన, సిద్దయ్య, స్వాతి, బార్  అసోసియేషన్ అధ్యక్షులు  జన్నారెడ్డి, న్యాయవాదులు  కరుణాకర్, దుర్గా రెడ్డి, నర్సిములు, శారద, పోచయ్య, జనార్దన్ రెడ్డి, రాజిరెడ్డి,  కిరణ్ రాజ్, శ్రీనివాస్, బాలయ్య, గవర్నమెంట్ ప్లీడర్ శ్రీపతి రావు, కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.