మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. బీర. టిపిసిసి ఉపాధ్యక్షులు చామల

మహిళలకు ఉచిత కుట్టుమిషన్లు పంపిణీ చేసిన ప్రభుత్వ విప్. బీర. టిపిసిసి ఉపాధ్యక్షులు చామల

ఆలేరు (ముద్ర న్యూస్): మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందేందుకు స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావాలని ప్రభుత్వ విప్ మరియు ఆలేరు శాసనసభ సభ్యులు బీర్ల ఐఅయిలయ్య పిలుపునిచ్చారు. శుక్రవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా అలేరు పట్టణంలో మదర్ ఎడ్యుకేషన్ అండ్ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి సౌజన్యంతో మహిళలకు కుట్టుమిషన్ల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై పంపిణీ చేసిన అనంతరం మాట్లాడుతూ మహిళాలు అన్ని రంగాల్లో రాణించాలని పిలుపునిచ్చారు.

గతంలో ప్రస్తుత రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సితక్క) చేతుల మీదుగా యాదగిరిగుట్ట లో మహిళలకు ఉచిత కుట్టు మిషన్లు పంపిణీ చేశామని గుర్తు చేశారు. ఇప్పుడు అలేరు పరిసర ప్రాంతాల్లో చామల కిరణ్ కుమార్ రెడ్డి పంపిణీ చేయడం చాలా సంతోమన్నారు. ఈ సందర్భంగా మహిళల అభివృద్ధి కృషి చేస్తున్న మదర్ ఎడ్యుకేషన్ రూరల్ డేవలప్ మెంట్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షురాలు సంధ్యారెడ్డికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు. మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.