సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా కృషి

సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా కృషి
  • గ్యారంటీల అమలుకు ప్రజా పాలన
  •  ప్రజల కళ్ళలో  సంతోషాన్ని చూడటానికే 6 గ్యారంటీలు
  • మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా ఆరు గ్యారెంటీలను అమలు చేసి తీరుతాం: ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం

ముద్ర, బోయినిపల్లి: రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినిపల్లి మండలం గుండన్నపల్లి గ్రామంలో నిర్వహించిన ప్రజా పాలన కార్యక్రమంలో భాగంగా అభయా హస్తం దరఖాస్తుల స్వీకరణకు ముఖ్య అతిథిగా హాజరైన చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం మాట్లాడుతూ:ఎన్నికల మేనిఫెస్టోలో ప్రకటించిన విధంగా 6 గ్యారంటీలను  ప్రభుత్వం అమలు చేస్తుందని, తెలంగాణ రాష్ట్రంలోని మహిళల కళ్ళలో   సంతోషాన్ని చూడటానికి ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేసిన వెంటనే రెండు గ్యారెంటీలను అమలు చేశారు.మిగిలిన నాలుగు గ్యారంటీలను విజయవంతంగా అమలు చేయడానికి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రజాపాలన కార్యక్రమానికి శ్రీకారం చుట్టిందని,రానున్న రోజుల్లో మిగిలిన నాలుగు గ్యారెంటీలను అమలు చేస్తామని అన్నారు.

ప్రజలు పాలనను సద్వినియోగం చేసుకొని దరఖాస్తులు సమర్పించాలన్నారు.అవినీతికి తావు లేకుండా ప్రభుత్వ సంక్షేమ పథకాలు నేరుగా ప్రజలకు అందేలా కృషి చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ కొప్పుల లక్ష్మి, ఎంపీపీ పర్లపల్లి వేణుగోపాల్, ఎంపీటీసీ అక్కినపల్లి ఉపేందర్,జిల్లా సీఈవో గౌతం రెడ్డి, జిల్లా ఆర్డీవో పులి మధుసూదన్, తహాశీల్దార్ పుష్పలత, ఎంపీడీవో రాజేందర్ రెడ్డి, ఏవో ప్రణీత, ఉపసర్పంచ్ బోరు అంజయ్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు వన్నెల రమణారెడ్డి, అధికారులు, మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.