మంథనిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్

మంథనిలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన మంథని ఎంపీపీ, సర్పంచులు, ఎంపీటీసీలు కండువలు కప్పి పార్టీలోకి ఆహ్వానించిన మాజీ మంత్రి మంథని ఎమ్మెల్యే శ్రీధర్ బాబు

ముద్ర ప్రతినిధి, పెద్దపల్లి:  మంథని నియోజక వర్గంలో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. మంథని మండల పరిషత్ అధ్యక్షుడు ఎంపీపీ కొండ శంకర్ తో సహా ఐదుగురు ఎంపిటిసిలు,  ముగ్గురు సర్పంచులు,  బీఆర్ఎస్ నాయకులు శ్రీధర్ బాబు ఆధ్వర్యంలో హైదరాబాదులో ఆదివారం రాత్రి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారికి శ్రీధర్ బాబు కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఎన్నికల సమీపిస్తున్న సమయంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి పెద్ద ఎత్తున ఎంపీపీ తో సహా సర్పంచులు, ఎంపీటీసీలు, నాయకులు, కార్యకర్తలు  కాంగ్రెస్ పార్టీలో  చేరడంతో బీఆర్ఎస్ పార్టీకి  భారీ షాక్ తగిలినట్లైంది.