చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

ముద్ర ప్రతినిధి, వనపర్తి : వనపర్తి జిల్లా పానుగల్ మండలం కేతేపల్లి గ్రామానికి చెందిన బోయ స్వామి(57) అనే వ్యక్తి చేపల వేటకు వెళ్లి మృతి చెందాడు. పోలీసులు, గ్రామస్థులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన స్వామి చేపల వేట కోసం గ్రామ సమీపంలో ఉన్న గుండ్ల చెరువు దగ్గర ఉన్న గొడ్డు నాగన్న బావిలో చేపల వేటకు వెళ్లాడని, అక్కడ వలలో చిక్కుకొని మృతి చెందినట్లు తెలిపారు.

ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు గ్రామస్తుల సహకారంతో బావి దగ్గరకు వెళ్లి చూడగా స్వామి ధరించిన బట్టలు చెప్పులు ఒడ్డు దగ్గర ఉండడంతో బావిలో వెతకగా మృతదేహం  లభ్యమైనట్లు తెలిపారు. మృతునికి భార్య శ్యామలమ్మ ఇద్దరు కూతుర్లు, కుమారుడు ఉన్నారు.మృతుడి కుమారుడు రామకృష్ణ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని మృతదేహాన్నికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు హెడ్ కానిస్టేబుల్ రామచందర్ తెలిపారు.