దేశంలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి

దేశంలో జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టాన్ని తీసుకురావాలి
  • ఐజేయూ జాతీయ అధ్యక్షుడు -శ్రీనివాస్ రెడ్డి

హుజూర్ నగర్ టౌన్ ముద్ర:దేశంలో రోజురోజుకు పెరుగుతున్న జర్నలిస్టుల పైన దాడులు , జరుగుతున్న నేపథ్యంలో వారి రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని ఐజేయూ జాతీయ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అన్నారు.సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ లో ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ దేశంలో పాట్నా, ఛత్తీస్గడ్ రాష్ట్రాల్లో జర్నలిస్టుల రక్షణ కోసం ప్రత్యేక చట్టాలు అమలు చేశాయన్నారు.జర్నలిస్టుల రక్షణకు చట్టాలు చేసే బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదే అని పేర్కొన్నారు. దేశంలో రాను రానుపత్రికా స్వేచ్ఛ హరించుకుపోయిందన్నారు.పాకిస్తాన్ కంటే భారత దేశంలోపత్రికా స్వేచ్ఛ గణనీయంగా తగ్గిపోయింది అన్నారు.అక్టోబర్ 2 గాంధీ జయంతి సందర్భంగా దేశంలోని జర్నలిస్టుల సమస్యలపై  ఢిల్లీలోనిరసన కార్యక్రమాలను చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.నిరసనకు జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు.

రాష్ట్రంలో జర్నలిస్టులందరికీ ప్రభుత్వం ఇండ్ల స్థలాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు అత్యున్నతమైన న్యాయమూర్తి ఇండ్ల స్థలాల విషయంలో తీర్పు చెప్పిన అమలు చేయకుండా కాలయాపన చేయడం సరైన విధానం కాదని అన్నారు. ప్రభుత్వం ద్వంద వైఖరి అవలంబిస్తుందన్నారు. అనంతరం టియు డబ్ల్యూజే  జిల్లా అధ్యక్షుడు కోలా నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కె శ్రీనివాస్ రెడ్డిని శాలువాలు, గజమాలతో ఘనంగా సన్మానించారు.  కార్యక్రమంలో సిపిఐ నాయకులు గన్నా చంద్రశేఖర రావు, సిపిఐ జిల్లా కార్యదర్శి బెజవాడ వెంకటేశ్వర్లు, ఎల్లావుల రాములు, జర్నలిస్టులు పిల్లలమర్రి శ్రీనివాస్, బసవోజు శ్రీనివాస చారి, శేషం రాజు, దేవరం రామ్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇట్టి మల్ల రామకృష్ణ, కొమర్రాజు అంజయ్య, చిట్టి పోతుల రమేష్, రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.