కాలువలో పడి యువకుడి మృతి

కాలువలో పడి యువకుడి మృతి

ముద్ర,హుజురాబాద్: హుజూరాబాద్ మున్సిపల్ పరిధి కేసీ క్యాంపు సమీపంలోని కాకతీయ ప్రధాన కాలువలో ప్రమాదవశాత్తు కాలు జారీ పడిపోయి వరాల నరేందర్రెడ్డి(23) అనే యువకుడు మృతి చెందినట్లు ఎస్సై సాంబయ్యగౌడ్ ఆదివారం తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం హన్మకొండ జిల్లా శాయంపేట మండలం ఆరేపల్లి గ్రామానికి చెందిన వరాల నరేందర్ రెడ్డి హుజూరాబాద్ మండలం చిన్నపాపయ్యపల్లిలోని తన బంధువుల ఇంటికి వచ్చాడు. దుర్గామాత మాలధారణ ధరించినట్లు చెప్పారు. ఉదయం తన తోటి వారితో కలిసి కాకతీయ ప్రధాన కాలువలో స్నానం చేసేందుకు వెళ్లారన్నారు. స్నానం కోసం దిగుతుండగా, ప్రమాదవశాత్తు కాలు జారీ నరేందర్రెడ్డి కాలువలో పడిపోయినట్లు తెలిపారు. ఈత రాకపోవటంతో కొట్టుకపోతుండగా, తోటి వారు గమనించి కాలువలోకి దూకి పైకి తీసుకొచ్చినట్లు తెలిపారు. హుటాహుటీన ఏరియా ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. సంఘటన స్థలాన్ని ఎస్సై సందర్శించారు. గ్రామీణులను పలు వివరాలు అడిగి తెలుసుకొన్నారు. మృతుని బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై  తెలిపారు.