వ్యక్తిపై వేట కొడవలితో దాడి 

వ్యక్తిపై వేట కొడవలితో దాడి 

ముద్ర ప్రతినిధి భువనగిరి : వ్యక్తిపై వేట కొడవలితో దాడి చేసి గాయపరిచిన సంఘటన జిల్లా కేంద్ర ఆస్పత్రి సమీపంలో  సోమవారం చోటు చేసుకుంది. జిల్లా కేంద్ర ఆస్పత్రి సమీపంలో   డయాగ్నోస్టిక్ సెంటర్ నిర్వహిస్తున్న శిగ నరేష్ గౌడ్ పై  నయీం అనుచరుడు రౌడీ షీటర్ బాబా అనే వ్యక్తి వేట కొడవలితో వెనుక నుంచి దాడి చేశాడు. వెంటనే తేరుకున్న  నరేష్ పరిగెత్తాడు. నరేష్ కి చెవి, వీపు భాగంలో గాయాలయ్యాయి.  బాధితుడికి భువనగిరి జిల్లా కేంద్ర ఆస్పత్రిలో చికత్స అందిస్తున్నారు. నిందితుడు పరారీలో ఉన్నాడు.