ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుక

ఘనంగా జాతీయ చేనేత దినోత్సవం వేడుక

వలిగొండ (ముద్ర న్యూస్): జాతీయ చేనేత దినోత్సవం పురస్కరించుకోని వలిగొండ మండల కేంద్రంలో పద్మశాలి నాయకులు అధ్వర్యంలో చేనేత దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వలిగొండ మండల కేంద్రంలోని దొంత శంకరయ్య మగ్గం షెడ్డులో చేనేత వృత్తిపై ఆధారపడి నివసిస్తున్న కార్మికులను శాలువాలతో సన్మానించి స్వీట్లు, పండ్లు పంపిణీ చేశారు. అనంతరం చేనేత నాయకులు మాట్లాడుతూ ఎంతో నైపుణ్యంతో కూడుకున్న వృత్తి చేనేత రంగమని, ప్రస్తుత కాలంలో చేనేత కార్మికులు సరైన ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారని, ప్రభుత్వాలు పెద్ద ఎత్తున రాయితీలు కల్పించి చేనేత రంగాన్ని కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో తవుటం నరహరి, దొంత శంకరయ్య, గంజి నారాయణ, సాయిని యాదగిరి, ఐటిపాముల ప్రభాకర్, మిరియాల శ్రీనివాస్, రచ్చ సంతోష్ కుమార్, ఎక్కలదేవి శ్రీనివాస్, గంజి ఉపేందర్, దొంత శ్యామ్, కిరణ్, బొడ ఈశ్వర్, పిస్క సంతోష్, చేనేత కార్మికులు పాపని లక్ష్మయ్య, శేకర్, కిరణ్, లక్ష్మి, లావణ్య మరియు తదితరులు పాల్గొన్నారు.