ప్రారంభానికి సిద్ధమైన ‘విప్రహిత’  బ్రాహ్మణ సధనం

ప్రారంభానికి సిద్ధమైన ‘విప్రహిత’  బ్రాహ్మణ సధనం
  • రేపు ప్రారంభించనున్న దేవాదాయ, విద్యుత్ శాఖ మంత్రులు ఇంద్రకరణ్ రెడ్డి, జగదీష్ రెడ్డి 
  • రెండు కోట్ల వ్యయం తో సకల హంగులతో  దురాజ్ పల్లి లో నిర్మితమైన బ్రాహ్మణ సదనం 
  • హర్షం వ్యక్తం చేస్తున్న బ్రాహ్మణ సమాజం 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-విప్రహిత బ్రాహ్మణ సదనం పథకం కింద తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేట  జిల్లా కేంద్రం లోని ధురాజ్ పల్లి   సమీపం లో విజయవాడ- హైదరాబద్ జాతీయ రహదారి పై నిర్మిస్తున్న విప్రహిత బ్రాహ్మణ సదనం ప్రారంభానికి సిద్ధమైంది.బ్రాహ్మణ సదనం నిర్మాణానికి స్థానిక నివాసి డాక్టర్‌ ఏ రామయ్య ఒక ఎకరం స్థలాన్ని స్వచ్ఛందంగా తెలంగాణ బ్రాహ్మణ పరిషత్‌కు ఇవ్వగా అక్కడ బ్రాహ్మణ సదన్‌ నిర్మాణానికి ప్రభుత్వం రూ.రెండు కోట్లు కేటాయించి సకల హంగులతో నిర్మించింది. కాగా ఆదివారం ఉదయం 10:00 గంటలకు దేవాదాయ శాఖా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి తో కలిసి , సూర్యాపేట శాసన సభ్యులు, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ప్రారంభిస్తారు.