బుమ్రా కెప్టెన్

బుమ్రా కెప్టెన్
  • కోచ్​గాసితాన్షు కోటక్ 
  • ఐర్లాండ్ సిరీస్‌కు టీమిండియా రెడీ 

ముంబై :  వెస్టిండీస్‌తో టీ20 సిరీస్ ముగిసిన తర్వాత భారత జట్టు ఐర్లాండ్‌తో సిరీస్ ఆడుతుంది. డబ్లిన్ వేదికగా మూడు టీ20ల సిరీస్ జరుగుతుంది. ఈ సిరీసులో భారత జట్టు సారధిగా జస్‌ప్రీత్ బుమ్రాను ఎంపిక చేశారు. ఆ తర్వాత జరిగే ఆసియా కప్‌ను దృష్టిలో ఉంచుకొని సీనియర్లతోపాటు హార్దిక్ పాండ్యాకు కూడా ఈ సిరీసులో విశ్రాంతి ఇవ్వడం జరిగింది. ఈ క్రమంలోనే ఐర్లాండ్‌కు టీంతోపాటు కోచ్‌గా ఎన్సీయే కోచ్ వీవీఎల్ లక్ష్మణ్ వెళ్తాడని అంతా అనుకున్నారు. కానీ అతను ఐర్లాండ్ వెళ్లడం లేదు. ఈ క్రమంలోనే ఇండియా-ఎ కోచ్ సితాన్షు కోటక్‌ను ఐర్లాండ్ పంపాలని బీసీసీఐ నిర్ణయించింది. ఐర్లాండ్ సిరీసులో టీమిండియా కోచ్‌గా అతన్ని నియమించినట్లు ప్రకటించింది.  ఆ తర్వాత జరిగే ఆసియా కప్, వన్డే వరల్డ్ కప్ నేపథ్యంలో టీమిండియా రెగ్యులర్ కోచింగ్ స్టాఫ్‌కు కూడీ విశ్రాంతి ఇవ్వడం జరిగింది. దీంతో ఆగస్టు 18 నుంచి మొదలయ్యే ఐర్లాండ్‌ సిరీసులో టీమిండియా కోచ్‌గా ఎన్సీయే హెడ్ కోచ్ వీవీఎస్ లక్ష్మణ్‌ను పంపాలని అనుకున్నారు. కానీ ఎమర్జింగ్ క్యాంప్ ఉండటంతో తాను ఎన్సీయేలోనే ఉంటానని లక్ష్మణ్ చెప్పేశాడట.  దీంతో అతని స్థానంలో సితాన్షు కోటక్‌ను జట్టుతో పంపాలని బీసీసీఐ డిసైడ్ అయింది. ఇండియా-ఎ కోచ్‌గా ఎంతోకాలం సేవలందించిన కోటక్‌కు ఈ రోల్‌లో మంచి అనుభవం కూడా ఉంది. టీమిండియా వెటరన్ పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా పూర్తి ఫిట్ నెస్ సాధించాడని ఎన్సీయే వర్గాలు భావించిన అనంతరం అతన్ని ఐర్లాండ్ టూ్‌కు పంపారు.  ఈ సిరీసులో బుమ్రా కనుక రాణిస్తే.. టీమిండియాకు అది చాలా గొప్ప విషయమే అని ఫ్యాన్స్ అంటున్నారు. గతేడాది బ్యాక్ పెయిన్‌తో జట్టుకు దూరమైన బుమ్రా.. ఈ ఏడాది మాత్రం ఎన్సీయేలోనే చాలా కష్టపడి కోలుకున్నాడు. ఆసియా కప్, వరల్డ్ కప్‌లలో టీమిండియాకు అతనే కీలకం.