తిరుమలలో  రోహిత్.. 

తిరుమలలో  రోహిత్.. 
  • కుటుంబంతో కలిసి తిరుపతి బాలాజీ దర్శనం

హైదరాబాద్ :  టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ కూడా ఆలయాల బాట పట్టాడు. ఆసియా కప్‌నకు ముందు కుటుంబంతో కలిసి ఆంధ్రప్రదేశ్‌లోని తిరుమల బాలాజీని దర్శించుకున్నాడు.  ఇటీవలి కాలంలో టీమిండియా ప్లేయర్లు అందరూ ఆలయాలు సందర్శిస్తున్న సంగతి తెలిసిందే.  గతేడాది పేలవ ఫామ్ నుంచి బయట పడటానికి ముందు విరాట్ కోహ్లీ కూడా ఆలయ సందర్శనం చేశాడు. ఇక అప్పటి నుంచి టీమిండియా ప్లేయర్లు అవకాశం దొరికినప్పుడల్లా ఆలయాలకు వెళ్తుండటం కనిపిస్తోంది.  రోహిత్ కూడా ఫామ్ అందుకుంటే ఆసియా కప్‌తోపాటు వరల్డ్ కప్‌లో కూడా టీమిండియాకు ఎదురుండదు. ఆసియా కప్ నుంచే దేశంలో వరల్డ్ కప్ హీట్ మొదలవుతుందని అంతా అనుకుంటున్నారు. ఇలాంటి కీలకమైన టోర్నీ ముందు రోహిత్ శర్మ ఇలా తిరుపతి వెంకటేశ్వరస్వామిని దర్శించుకోవడంపై ఫ్యాన్స్ రకరకాలుగా స్పందిస్తున్నారు.