మతోన్మాద బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం

మతోన్మాద బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకుంటాం
  • బిఆర్ఎస్ రానున్న ఎన్నికల్లో ఓడిపోవడం ఖాయం
  • కాంగ్రెస్ పార్టీతో ఎన్నికల చర్చలు జరుగుతున్నాయి
  •  పార్టీ బలోపేతం కోసం కార్యకర్తలు కృషి చేయాలి
  •  సిపిఎం సూర్యాపేట జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించిన సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రo


ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-మతోన్మాద బిజెపిని అధికారంలోకి రాకుండా అడ్డుకునేది కమ్యూనిస్టులేనని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం అన్నారు. మంగళవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని విగ్నేశ్వర ఫంక్షన్ హాల్ లో నిర్వహించిన సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి శిక్షణ తరగతులను ప్రారంభించి మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో మతోన్మాద బిజెపిని,తెలంగాణ రాష్ట్రంలో అధికారం లో ఉన్న బిఆర్ఎస్ ని ఓడించాలని అన్నారు. దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  మతోన్మాద చర్యలకు పాల్పడుతూ మేధావులను జర్నలిస్టులను, హక్కుల కార్యకర్తలను అంతం చేస్తుందన్నారు. దేశంలో ఉన్న సంపద మొత్తాన్ని కార్పొరేట్ శక్తులకు అక్రమంగా అప్పనంగా కట్టబెడుతుందని ఆరోపించారు. దేశంలో లాభాలలో ఉన్న  ఎల్ఐసి, రైల్వే, పోస్టల్, విమానయానం, విశాఖ ఉక్కువంటిప్రభుత్వ రంగ సంస్థలను కారు చౌకగా అంబానీ ఆదానీలకు కట్టబెడుతుందని విమర్శించారు. దేశంలో బిజెపి రెండవసారి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలపై అనేక భారాలు మోపారనిఅన్నారు. పెట్రోల్ డీజిల్ నిత్యవసర వస్తువుల ధరలను విపరీతంగా పెంచడం మూలంగా పేద మధ్యతరగతి ప్రజలపై తీరని భారం పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. బిజెపి ప్రభుత్వానికి ఏమాత్రం చిత్తశుద్ధి ఉన్న మహిళ బిల్లును  వెంటనే ఆమోదింప చేయాలని డిమాండ్ చేశారు. దేశంలో ఎన్నో సంవత్సరాలుగా కులగన ణ చేపట్టాలని అన్ని పార్టీలు కోరుతుంటే బిజెపి మాత్రం కులగనణ చేపట్టటం లేదని ఆరోపించారు. కులగనణ చేపట్టడం మూలంగా అట్టడుగు వర్గాల లో ఉన్న  బీసీలకు ఎంతోలాభం జరుగుతుందన్నారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గత ఎన్నికల ముందు అనేక వాగ్దానాలు ఇచ్చి అధికారంలోకి వచ్చిందనిఅధికారంలోకి వచ్చి పది సంవత్సరాల కాలంలో ఇచ్చిన ఈ ఒక్క వాగ్దానాన్ని నేటికి అమలు చేసిన పాపాన పోలేదన్నారు. పాత హామీలకే  గతి లేదు కానీ  కొత్త హామీలు ఇవ్వడం లో అర్థం లేదన్నారు. రాష్ట్ర మంత్రులుహరీష్ రావు,కేటీఆర్ ప్రకటనలుఅవకాశవాదంగా ఉన్నాయన్నారు. 2024 ఎన్నికల్లో ఎటువైపు ఉంటారో చెప్పకుండా గెలిచే పార్టీకే మద్దతు ఇస్తామని చెప్పడం అవకాశవాద రాజకీయాలకు నిదర్శనం అన్నారు. టిఆర్ఎస్ పార్టీ బిజెపితో లోపాయి కార ఒప్పందంలో భాగంగా వ్యవహరిస్తున్నాయని విమర్శించారు. కాంగ్రెస్ పార్టీతో చర్చలు జరుగుతున్నాయనిత్వరలో సీట్ల సర్దుబాటు జరుగుతుందన్నారు. ఆ తర్వాత పోటీ చేసే అభ్యర్థుల వివరాలను వెల్లడిస్తామని చెప్పారు.

 మతం -మతోన్మాదం

సిపిఎం పార్టీ సూర్యాపేట జిల్లా స్థాయి రాజకీయ శిక్షణ తరగతులు భాగంగా మతం మతోన్మాదం అని క్లాసు రాష్ట్ర ఎడ్యుకేషన్ కమిటీ నాయకులు బండారు రమేష్ బోధించారు.శిక్షణ తరగతుల సందర్భంగా సిపిఎం పార్టీ పతాకాన్ని సిపిఎం సీనియర్ నాయకులు నాగిరెడ్డి శేఖర్ రెడ్డి జెండా ఆవిష్కరణ చేశారు. ఈ శిక్షణ తరగతులలో ప్రజానాట్యమండలి కళాకారులు ఆలపించిన విప్లవ గేయాలు పలువురిని ఆకట్టుకున్నాయి.సిపిఎం జిల్లా కార్యదర్శి మల్లు నాగార్జున రెడ్డి ప్రిన్సిపల్ గా వ్యవహరించిన ఈ శిక్షణ తరగతుల్లో సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు నెమ్మాదివెంకటేశ్వర్లు, కొలిశెట్టి యాదగిరిరావు బుర్రి శ్రీరాములు, పారేపల్లి శేఖర్ రావు, మట్టి పెళ్లి సైదులు, మేదరమెట్ల వెంకటేశ్వరరావు, చెరుకు ఏకలక్ష్మి, కోట గోపితదితరులు పాల్గొన్నారు.