దివ్యాంగ దంపతులపై చలసాని ఫౌండేషన్ ఔదార్యం ‌

దివ్యాంగ దంపతులపై చలసాని ఫౌండేషన్ ఔదార్యం ‌
  • 20 వేల రూపాయల ఆర్థిక సహాయం

ముద్ర నేరేడుచర్ల:- దివ్యాంగ దంపతులపై చలసాని ఫౌండేషన్ ఆదరణ చూపింది. ఆర్థికంగా కడు దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్న మండలంలోని దిర్శించర్ల గ్రామానికి చెందిన దివ్యాంగ దంపతులు కోట కరుణాకర్ , శైలజ లకు చలసాని ఫౌండేషన్ అధినేత చలసాని రాజీవ్, ఐజేయు జాతీయ కౌన్సిల్ సభ్యుడు చలసాని శ్రీనివాసరావులు బుధవారం  20 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా ఫౌండేషన్ అధినేత రాజీవ్ మాట్లాడుతూ నిరుపేదలకు , నిరుపేద విద్యార్థులకు , సమాజంలో అట్టడుగు వర్గాల వారి అభ్యున్నతికి కృషి చేస్తున్నామన్నారు. సామాజిక సేవలో పాలుపంచుకుంటున్న రాజీవ్ ఫౌండేషన్ సమాజంలోని ఆర్తులు అన్నార్తులు, అసహయుల  అభివృద్ధి కోసం, మానవీయ విలువల పెంపు కోసం కృషి చేస్తున్నట్టు వివరించారు. ఆపదలో ఉన్నవారు, సహాయం కావాల్సినవారు, కడు నిరుపేదలు తమ ఫౌండేషన్ ను సంప్రదించవచ్చని ఆయన వివరించారు. అనంతరం దిర్శించర్ల బాప్టిస్ట్ చర్చిలో ప్రార్థనలో పాల్గొన్నారు. వీరి వెంట జెడ్పిటిసి రాపోలు నరసయ్య, సత్తార్, రాపోలు వినోద్, కుర్రి వెంకన్న, కోట నాగయ్య, రాపోలు మనోహర్, చామకూరి వినోద్ తదితరులు పాల్గొన్నారు.