రైతు ఆదాయంతోనే దేశ అభివృద్ధి

రైతు ఆదాయంతోనే దేశ అభివృద్ధి

కిసాన్ గ్రామీణ మేళా కన్వీనర్ పి సుధాకర్ రావు

ముద్ర ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ లోని పద్మనాయక కల్యాణ మండపం ఆవరణలో కిసాన్ గ్రామీణ మేళా 2023 వేలాది మంది రైతులు రైతుల సమక్షంలో మేళా కన్వీనర్ పి సుగుణాకర్ రావు , ప్రధానమంత్రి ఎం ఎస్ పి కమిటీ సభ్యులు రైతు నాయకులు పాషా పటేల్ , బినోద్ ఆనంద్ కరీంనగర్ డైరి ఛైర్మెన్ ప్రారంభించారు. మేళాలో ఏర్పాటుచేసిన 100కు పైగా స్టాళ్లను సందర్శించారు. మేళాలో అధునాతన యంత్రాలు, వినూతన ఆవిష్కరణలు మరియు వివిధ కంపెనీల ఉత్పత్తులను పరిశీలించారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో కిసాన్ జాగరణ్ అధ్యక్షులు పి. సుగుణాకర్ రావు స్వగతోపన్యసం చేస్తూ గతంలో ప్రభుత్వాలు రైతులకు కొత్త విషయాలను తెలుపుటకై వ్యవసాయ ప్రదర్శనలు నిర్వహించే వారిని ప్రభుత్వాలు విస్మరించిన కిసాన్ జాగరణ్ పేరా గత సంవత్సరం నుండి కిసాన్ గ్రామీణ మేల నిర్వహిస్తున్నానని ఈ మేళాలో అనేక కొత్త విషయాల పైన రైతులకు అవగాహన కల్పిస్తున్నామని యంత్రాలు, వస్తువులు తక్కువ ధరలకు అమ్మకాలు చేస్తున్నారని వీటిని సద్వినియోగం చేసుకోవాలని రైతులకు సూచించారు.

సమాజంలోని ఇతర వర్గాల ప్రజలతో పోలిస్తే రైతు ఆర్థిక సామాజిక స్థితి బాగాలేదని రైతు ఆర్థికంగా బాగుపడందే సమగ్ర దేశాభివృద్ధి జరగదని పేర్కొన్నారు. ప్రధానమంత్రి MSP కమిటీ సభ్యులు రైతు నాయకులు పాషా పటేల్ మాట్లాడుతూ మన దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా కూడా పర్యావరణ సమతుల్యం దెబ్బతిందని లిబియా దేశంలో ఒకేరోజు 50 సంవత్సరాలలో కురిసేంత వర్షం కురియటం మూలంగా బాగా దెబ్బతిందని అలాగే మన దేశంలో కూడా కొన్ని రోజులు అతివృష్టి మరికొన్ని రోజులు అనావృష్టి కారణంగా పంటలపై ప్రభావం పడుతుందని రాబోయే 50 సంవత్సరాల తదుపరి ఉష్ణోగ్రత పెరగడం మూలంగా పంటలు పండే అవకాశం లేదని దీనివల్ల మానవ మనుగడకే ప్రమాదం ఉందని హెచ్చరించారు. పర్యావరణ పరిరక్షణకై విస్తృతంగా చెట్లు నాటడమే దీనికి పరిష్కారమని సూచించారు.

ప్రధానమంత్రి MSP మరో సభ్యులు బినోద్ ఆనంద్ గారు మాట్లాడుతూ రైతులు ఉచితాల గురించి ఆలోచించకుండా వాళ్లే ఇతరులకు సహాయం చేసే స్థితికి ఎదగాలని అప్పుడే దేశ ఆర్థికంగా ముందుకు పోతుందని తెలిపారు, ఈ మేళా నిర్వహణ వల్ల కరీంనగర్ జిల్లా రైతులకు ఎంతో లాభం జరుగుతుందని ప్రభుత్వాలు చేసే కార్యక్రమాలని సుగుణాకర్ రావు చేయడం ఆనందదాయకమని తెలిపారు. కె వి కె శాస్త్రవేత్త వెంకటేశ్వరరావు మాట్లాడుతూ రైతులకు కేవలం పంట పండించడం వరకే పరిమితం కాకుండా కూరగాయలు, పండ్లు, పాడి తదుపరి వ్యవసాయ అనుబంధ రంగాలలో కూడా పనిచేయాలని సూచించారు. లక్ష్మీ నారాయణ అనే శాస్త్రవేత్త మాట్లాడుతూ పత్తి పంటపై గులాబీ రంగు పురుగు నివారణకు రైతులు చేయవలసిన చర్యల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ రైతు కూలీలు సత్యనారాయణ రెడ్డి , ఎఫ్ పి ఓ అధ్యక్షులు వెంకట్ రెడ్డి , బిజెపి నాయకులు ఓదేలు, శంకర్, మల్లేష్ యాదవ్, మహేందర్ రెడ్డి, మారుతి, సునీల్ తదితరులు పాల్గొన్నారు.