రాజకీయంగా ఎదగడం కోసం జీవన్ రెడ్డిపై విమర్శలు..

రాజకీయంగా ఎదగడం కోసం జీవన్ రెడ్డిపై విమర్శలు..
  • జీవన్ రెడ్డినీ విమర్శించే ముందు ఆత్మ విమర్శ చేసుకోవాలి
  • జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి

ముద్ర ప్రతినిధి, జగిత్యాల: ఎమ్మెల్సీ ఎన్నికల్లో బీఆర్ఎస్, కాంగ్రెస్ లోపాయికారి ఒప్పందంతో జీవన్ రెడ్డి గెలిచారనడం బిజేపీ నాయకురాలు బోగ శ్రావణి రాజకీయ అవివేకానికి, అనాలోచిత ధోరణికి నిదర్శనమని జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు తాటి పర్తి విజయలక్ష్మి దేవేందర్ రెడ్డి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఎమ్మెల్యే ఎన్నికల్లో భారీ మెజారిటీ తో సంజయ్ గెలిచారన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో లోపాయికారి ఒప్పందం అన్నారు. ఎంపీ ఎన్నికల్లో కవిత ఓటమి పై బీఅర్ఎస్ తప్పిదలను ఎత్తి చూపారు. ఇందులో ఎవరు లబ్ది పొందారో తెలుసుకోని, మాట్లాడాలన్నారు.

బీసీలపై కపట ప్రేమ ప్రదర్శిస్తున్న శ్రావణికి ఎమ్మెల్సీ ఎన్నికల్లో రవాణా అధికారికి బిఫామ్ ఇవ్వకుండా మోసం చేస్తే ఆనాడు బీసీ గొంతుక ముగా బోయిందా బిసి సమాజానికి చెప్పాలన్నారు. పదవిలో ఉన్నప్పుడు మోసాలను దాచిపెట్టి, జీవన్రెడ్డిని విమర్శించడం హాస్యాస్పదం అన్నారు. పదవులు ఎవరి భిక్ష కాదు.. ప్రజల భిక్ష.. రాజ్యాంగం భిక్ష.. రాజ్యాంగ ఫలాలు అందించేందుకు వ్యక్తులను గుర్తించి, పార్టీలు టికెట్ ఇస్తే, ప్రజలు ఆశీర్వదిస్తేనే నువ్వు కౌన్సిలర్ నుంచి చైర్ పర్సన్ అయ్యావని మర్చిపోకు. బిసి రిజర్వేషన్ తో చైర్మన్ అయిన నువ్వు ప్రజా తీర్పుని అగౌరవ పరచి స్వార్థం కోసం పదవిని మధ్యలోనే వదిలేశావ్... అదే రాజ్యంగాన్ని అవమానించి, అంబేద్కర్, రిజర్వేషన్ ల స్ఫూర్తి కి విఘతం కల్పించావని అన్నారు. 9 నెలలుగా బిసి మహిళలు పొందాల్సిన రిజర్వేషన్ పైన ఎందుకు మౌనంగా ఉన్నావని ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో కల్లేపల్లి దుర్గయ్య,గాజుల రాజేందర్, కోర్టు శ్రీను, చిట్ల లత, చాంద్ పాషా, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు.