క్రికెట్ బెట్టింగ్ మూట గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు

క్రికెట్ బెట్టింగ్ మూట గుట్టు రట్టు చేసిన సైబరాబాద్ పోలీసులు
  • 10 మండి అరెస్ట్
  • 66 లక్షలు నగదు స్వాధీనం, మొత్తం  కోటి విలువ గల వస్తువులు స్వాధీనం

ముద్ర ప్రతినిధి, రంగారెడ్డి: సైబరాబాద్ పోలీసులు క్రికెట్ బెట్టింగ్ ముఠా గుట్టు రట్టు చేసారు. బెట్టింగ్ యాప్స్ సహకారంతో IPL మ్యాచ్‌లు పై బెట్టింగ్ నిర్వహిస్తున్న 10 మందిని సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేసి 66 లక్షలు నగదు థో పాతు మొత్తం కోటి విలువైన  ఫోనులు, ల్యాప్‌టాప్‌లు, కార్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు వివరాలు మంగళవారం సైబరాబాద్‌ పోలీస్‌ కమిషనర్‌ స్టీఫెన్‌ రవీంద్ర వివరాలు మీడియా సమావేశంలో వెలదించారు. సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర వివరాల ప్రకారం.... సైబరాబాద్ పోలీసు కమీషనరేట్ పరిధిలోని  బాచుపల్లిలో అనురాగ్ కాలనీలో  సైబరాబాద్ పోలీసులు లు , బాచుపల్లి, బాలానగర్ పోలీసులు దాడులు నిర్వహించారు. బెట్టింగ్ యాప్‌లు సహాయంతో బెట్టింగ్ ముటా బెట్టింగ్ రాకెట్ నిర్వహిస్తున్నారు.

ఈ సందర్బంగా పోలీసులు 10 మందిని అరెస్ట్ చేసారు. 66 లక్షలు నగదు తో పాటూ  మొత్తం కోటి విలువైన 19 ఫోనులు, 8 ల్యాప్‌టాప్‌లు, మూడు బైక్‌లు, టీవీలు మూడు, 60 మొబైల్ సిమ్‌లు, స్వాధీనం చేసుకున్నారు. అరెస్టు అయిన వారి లో  యూసుఫ్‌గూడకు చెందిన శివరామ కృష్ణ, ప్రతాప్ గణ కుమార్, పంజాగుట్టకు చెందిన మహేష్, చి రెడ్డి కాసి, బంజారా హిల్స్ కు చెందిన శ్రీనివాస్ బాబు, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన విజయ్ కుమార్, చీరాల కు చెందిన శ్రీకాంత్, పశ్చిమగోదావరి జిల్లాకు చెందిన వినయ్, వెంకటరత్న కుమార్ లు ఉండగా, ఒక్కరు పరారీలో ఉన్నారు. క్రికెట్ బెట్టింగ్ గురించి జాగ్రత్తగా వ్యవహరించాలని, అంతే కాకుండా బెట్టింగ్ గురించి పోలీసులకు సమాచారం అందించాలని సైబరాబాద్ పోలీస్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర అన్నారు.