కర్నాటక సీఎం పదవి కోసం డీకే శివకుమార్​, సిద్ద రామయ్య పోటీ

కర్నాటక సీఎం పదవి కోసం డీకే శివకుమార్​, సిద్ద రామయ్య పోటీ

కర్నాటక సీఎం పదవి కోసం డీకే శివకుమార్​, సిద్ద రామయ్య పోటీపడుతున్నారు. ఇద్దరు నేతలు తమ ప్రయత్నాలు జోరుగా కొనసాగిస్తున్నారు. అయితే సీఎం పదవిని ఎవరికి ఇవ్వాలో హైకమాండ్​ నిర్ణయం తీసుకుంటుందని ఏఐసీసీ అద్యక్షుడు మల్లికార్జన ఖర్గే తెలిపారు. దేశమంతా కాంగ్రెస్​ కార్యకర్తల సంబరాలు అంబరాన్ని అంటాయి. దక్షణ భారతంలో అధికారంలో ఉన్న ఏకైక రాష్ట్రాన్ని బీజేపీ కోల్పోయింది. కర్నాటకలో అంచనాలకు మించి కాంగెసు భారీ విజయం సాధించింది. ఆ పార్టీ 140 స్థానాలకు చేరువలో ఉంది. రిసార్టు రాజకీయాలతో పనిలేకుండా ప్రభుత్వం ఏర్పాటు చేసే స్థితిలో ఉంది.