29న బ్యాంకులకు సెలవు

29న బ్యాంకులకు సెలవు

న్యూఢిల్లీ: బక్రీద్ సందర్బంగా 2023 జూన్ 29న బ్యాంక్​లు హాలిడే ప్రకటించాయి. గురువారం రోజున బ్యాంకులు పనిచేయవు. ఇస్లామిక్ మంత్ ధూల్ హిజాహ్ పదో రోజున బక్రీద్ పర్వదినాన్ని నిర్వహించుకుంటారు. బక్రీద్ సందర్బంగా జూన్ 29న అగర్తలా, అహ్మదాబాద్, ఐజ్వాల్, బెంగళూరు, భోపాల్, చెన్నై, ఛండీగడ్, డెహ్రాడూన్, గువాహటి, ఇంపాల్, జైపూర్, జమ్మూ, కాన్సూర్, కోల్‌కతా, లక్నో, ఢిల్లీ , పాట్నా, పనాజా, షిల్లాంగ్, రాంచీ, సిమ్లా, శ్రీనగర్, ఏపీ, తెలంగాణలో కూడా బ్యాంకులు పని చేయవు.అయితే బెలాపూర్, భువనేశ్వర్, గ్యాంగ్‌టక్, కొచ్చి, ముంబై, నాగ్‌పూర్, తిరువనంతపురం వంటి ప్రాంతాల్లో మాత్రం బ్యాంకులు పని చేస్తారు. దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) హాలిడే క్యాలెండర్ ప్రకారం ఆ రోజుల బ్యాంకులు పని చేయవు. అందువల్ల బ్యాంక్‌లో పని ఉన్న వారు ఈ డేట్‌ను గుర్తించుకోవడం ఉత్తమం. లేదంటే బ్యాంక్‌కు వెళ్లి తిరిగి వెనక్కి రావాల్సి ఉంటుంది.

అయితే బ్యాంక్ హాలిడే ఉన్నా కూడా కస్టమర్లు ఇబ్బంది పడాల్సిన పని లేదు. ఆన్‌లైన్ బ్యాంకింగ్ సేవలు ఎల్లప్పుడు అందుబాటులో ఉంటాయి. మొబైల్ బ్యాంకింగ్, నెట్‌ బ్యాంకింగ్ ద్వారా సేవలు పొందొచ్చు. యూపీఐ సర్వీసులు కూడా అందుబాటులో ఉంటాయి. అందువల్ల బ్యాంక్ కస్టమర్లపై పెద్దగా ఎఫెక్ట్ ఉండకపోవచ్చు. అయితే బ్యాంక్‌ బ్రాంచ్‌లో పని ఉంటే మాత్రం కచ్చితంగా ఈ బ్యాంక్ హాలిడేను గుర్తు పెట్టుకోవడం ఉత్తమం. లేదంటే ఇబ్బంది పడాల్సి వస్తుంది.