14 గ్రామాలకు దీన్ దయాల్ జాతీయ పంచాయతీ అవార్డులు

14 గ్రామాలకు దీన్ దయాల్ జాతీయ పంచాయతీ అవార్డులు

 ముద్ర ప్రతినిధి,  వనపర్తి : వనపర్తి జిల్లా వీపనగండ్ల మండలం జాతీయ పంచాయతీ అవార్డుల్లో భాగంగా విభజన మండలంలో 14 గ్రామపంచాయతీలు తొమ్మిది విభాగాల్లో అవార్డులకు ఎంపికయ్యారని పంచాయతీల పనితీరుకు ఇది ఎంతో తలమానికమని ఎంపీడీవో కథలప్ప పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీడీవో కథలప్ప చేతుల మీదుగా 14 గ్రామపంచాయతీ ల అవార్డులను అందజేశారు. ఈ సందర్భంగా ఎంపిడిఓ మాట్లాడుతూ పంచాయతీల్లో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న తొమ్మిది రకాల పనులలో మండలంలో 14 గ్రామాలను ఎంపిక చేసినట్లు ఎంపీడీవో తెలిపారు సంక్షేమ పథకాలు పౌర సేవలు అభివృద్ధి పారిశుద్ధం హరితహారం వంటి పలు రకాల పథకాలను సమర్థవంతంగా అమలు చేసినందుకు జాతీయ స్థాయిలో దీన్ దయాలు ఉపాధ్యాయ జాతీయ పంచాయతీ అవార్డు అందజేయడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల సర్పంచులు,  ఎంపీటీసీలు, పంచాయతీ కార్యదర్శులు, అధికారులు పాల్గొన్నారు.