మాట నిలుపుకున్న.....మళ్లీ ఆశీర్వదించండి

మాట నిలుపుకున్న.....మళ్లీ ఆశీర్వదించండి
  •  సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సింగిరెడ్డి

ముద్ర ప్రతినిధి, వనపర్తి:ఎన్నికల ముందు ప్రజలకు ఇచ్చిన మాటను నిలుపుకున్నామని, మళ్లీ ఆశీర్వదిస్తే మరింత అభివృద్ధి చేసి చూపిస్తానని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి అన్నారు. బుధవారం వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో సీఎం సభ ఏర్పాట్లను పరిశీలించిన సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ముఖ్యమంత్రి చంద్రశేఖర రావు బహిరంగ సభ వనపర్తి పాలిటెక్నిక్ కళాశాల మైదానంలో మధ్యాహ్నం ఒంటిగంటకు ఉంటుందని ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. తాను ఎన్నికైన తర్వాత మంత్రిగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టానని, పెబ్బేర్ లో మత్స్య కళాశాల ఏర్పాటు చేశామని, గతంలో ఇచ్చిన మాట ప్రకారం ఇంజనీరింగ్ మెడికల్ కళాశాలలో ఏర్పాటు చేయడమే కాకుండా అదనంగా నర్సింగ్ వ్యవసాయ మహిళా డిగ్రీ కళాశాలలో కూడా ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు.

సమీకృత మార్కెట్, టౌన్ హాల్, వ్యవసాయ మార్కెట్ గోదాములు, మిషన్ భగీరథ పథకం కింద తాగునీరు అందిస్తున్నామన్నారు. రహదారుల విస్తరణ పూర్తి చేశామని, ప్రతిష్టాత్మకంగా ఐటీ టవర్ నిర్మించుకోబోతున్నామని ఆయన అన్నారు. 15 చట్టాలు పూర్తి చేసి మరో 20 చెక్కాములకు ప్రతిపాదనలు పంపమని తెలిపారు. నియోజకవర్గంలో 1,25,000 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి సహాయంతో ఇచ్చిన హామీలతో పాటు మరిన్ని పనులను  పూర్తి చేశామని చెప్పారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర సహకార యూనియన్ సభ్యులు తిరుమల మహేష్, జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్, కౌన్సిలర్ నాగన్న యాదవ్, నాయకులు పాల్గొన్నారు.