రుద్రంగి గ్రామ అభివృద్ధి నా వంతు పాత్ర పోషిస్తా - డాక్టర్ గోలిమోహన్

రుద్రంగి గ్రామ అభివృద్ధి నా వంతు పాత్ర పోషిస్తా - డాక్టర్ గోలిమోహన్

ముద్ర,రుద్రoగి:రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండల కేంద్రంలో గ్రామ పంచాయతీ ఆవరణలో ప్రభుత్వ ఉన్నత పాఠశాల విద్యార్థులకు స్కూల్ బ్యాగ్స్ లను ఆద్య గోలి ఫౌండేషన్ చైర్మన్ డాక్టర్ గోలి మోహన్ అందజేశారు. ఈ కార్యక్రమనికి ముఖ్యఅతిథిగా గ్రామ సర్పంచ్ ప్రబలత మనోహర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ గోలి మోహన్ ఎంతోమందికి సహాయం చేస్తూ విద్య ఉపాధి ,ఆర్థిక ఇబ్బందులకు తోడ్పడుతున్నాడని ఇలాంటివారు మా గ్రామానికి సహకరించడం సంతోషంగా ఉందన్నారు.డాక్టర్ గోలి మోహన్ ఉన్నతమైన చదువులు చదివి ఎన్నో దేశాలు తిరిగి ఈ ప్రాంతంలో పుట్టి ఈ ప్రాంతంలో పెరిగి ఈప్రాంతంలో పెరిగి పిల్లలకు విద్య విద్యను అందించడంలో ఎంతో సహకారాన్ని ఇస్తున్నారని అన్నారు.. ఈ మధ్యనే మెగా జాబ్ మేళా పెట్టి ఎంతోమంది నిరుద్యోగ యువతకి ఉద్యోగాలు ఇచ్చారు.ఇలాంటి వ్యక్తి ఈ ప్రాంతానికి వచ్చి ఎంతోమందికి సహాయం అందిస్తున్నాడని కొనియాడారు. డాక్టర్ గోలి మోహన్ మాట్లాడుతూ యువత చదువుకోవాలి ఆర్థికంగా ఎదగాలి ఉన్నతమైన చర్యలకు విదేశాలకు పోవాలి ఇలాంటి వారి కోసం నేను ఎప్పుడు ముందుంటానని హామీ ఇచ్చారు. గ్రామంలో అనేక సమస్యలు ఉన్నప్పటికీ వారు తన దృష్టికి తీసుకురాగానే, రాబోయే రోజుల్లో రుద్రంగి గ్రామ అభివృద్ధి చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తానని అన్నారు తర్వాత గ్రామంలో అన్ని వర్గాల ప్రజలు కలిసిమెలిసి ఉండాలని అభివృద్ధి సాధ్యమని అన్నారు. అనంతరం డాక్టర్ గోలి మోహన్ ను గ్రామసర్పంచ్ ప్రబలత మనోహర్ గ్రశాలువాతో సత్కరించారు.