డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూత

డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూత
Dubbing artist Srinivasa Murthy passes away

ప్రముఖ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ శ్రీనివాస మూర్తి కన్నుమూశారు. గురువారం ఆయన చెన్నైలోని తన నివాసంలో తుది శ్వాస విడిచారు. శ్రీనివాస మూర్తి చనిపోవటానికి గుండెపోటు కారణంగా తెలుస్తోంది. మామూలుగా గుండెపోటు వస్తే.. స్టంట్‌ వేసి ప్రాణాలు నిలపవచ్చు. కానీ, కార్డియాక్‌ అరెస్ట్‌ కనుక వస్తే పరిస్థితి దారుణంగా ఉంటుంది. ప్రాణాలు కోల్పోయే అవకాశాలే ఎక్కువగా ఉంటాయి. ఆయన ఇంగ్లీష్‌ సినిమాలను దక్షిణాదిలోని భాషల్లోకి ట్రాన్స్‌లేట్‌ చేసేవారు. డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా టాప్‌ పొజిషన్‌కు చేరుకున్నారు. సూర్య, అజిత్, మోహన్ లాల్, రాజశేఖర్, విక్రమ్‌లతో పాటు సల్మాన్‌ ఖాన్‌, షారుఖ్‌ ఖాన్‌లను కూడా డబ్బింగ్‌ చెప్పారు.

1998లో వచ్చిన శివయ్య సినిమాలో రాజశేఖర్‌కు డబ్బింగ్‌ చెప్పారు. ఈ సినిమాకు గాను శ్రీనివాసమూర్తి బెస్ట్‌ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌గా నంది అవార్డును సొంతం చేసుకున్నారు. శ్రీనివాస మూర్తి డబ్బింగ్‌ చెప్పిన సినిమాల్లో అజిత్‌ నటించిన ప్రియురాలు పిలిచింది, వివేకం, ఆశ ఆశ ఆశ, ఎంత వాడు గాని, గ్యాంబ్లర్‌, ఆవేశం, వాలి, రెడ్‌, ఆట ఆరంభం వంటి సినిమాలకు.. సూర్య నటించిన సింగం, సింగమ్‌ 2, సింగం 3, రాక్షసుడు, 24, వీడొక్కడే, ఆరు, నువ్వు నేను ప్రేమ తదితర సినిమాలకు.. విక్రమ్‌ నటించిన అపరిచితుడు, స్వామి 2, మల్లన్న, ఇంకొకడు. శివ తాండవం తదితర సినిమాలకు.. రాజశేఖర్‌ నటించిన మా ఆయన బంగారం, సింహరాశి, ఆయుధం, మా అన్నయ్య, శివయ్య, శేషు, పీఎస్‌వీ గరుడ వేగ, సూర్యుడు, మెకానిక్‌ అల్లుడు తదితర సినిమాలకు డబ్బింగ్‌ చెప్పారు. వీరితో పాటు చాలా మంది నటులకు ఆయన తన గొంతు అరువిచ్చారు.