కెసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ 

కెసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ 
  • బిఆర్ఎస్ అధినేతపై ఈసీ చర్యలు 
  • రేపటి జమ్మికుంట, శంకరపట్నం బస్సు యాత్ర రద్దు
  • ఎన్నికల ప్రచారంపై 48 గంటల నిషేధం 

ముద్ర ప్రతినిధి కరీంనగర్ :బిఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు కేంద్ర ఎన్నికల కమిషన్ బిగ్ షాక్ ఇచ్చింది. ఏప్రిల్ 5వ తేదీన సిరిసిల్లలో కాంగ్రెస్ పార్టీపై చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై ఈసీ చర్యలు చేపట్టింది. ఈరోజు రాత్రి 8 గంటల నుండి 48 గంటల పాటు ఆయన ఎలాంటి ప్రచారంలో పాల్గొనకూడదని నిషేధం విధించింది. దీంతో రేపు కరీంనగర్ పార్లమెంటు పరిధిలోని జమ్మికుంట శంకరపట్నం మండలంలో చేపట్టనున్న కేసీఆర్ బస్సు యాత్ర రద్దు అయినట్లు విశ్వాసనీయ సమాచారం. అత్యంత కీలక సమయంలో ఎన్నికల కమిషన్ చర్యలు బిఆర్ఎస్ శ్రేణులను గందరగోళంలో పడేశాయి. దీంతో ముందుగా నిర్దేశించుకున్న కెసిఆర్ ఎన్నికల ప్రచార షెడ్యూల్ మొత్తం మార్పులు చేసుకోవాల్సిన పరిస్థితిఏర్పడింది. 48 గంటల పాటు సభలు, సమావేశాలు, ప్రచారం, ఇంటర్వ్యూలలో పాల్గొనకూడదని ఎలక్షన్ కమిషన్ స్ట్రిక్ట్ గా ఆదేశించింది.