టాస్ అసోసియేట్ ఫెలోగా శ్రీనివాస్ ఎన్నిక

టాస్ అసోసియేట్ ఫెలోగా శ్రీనివాస్ ఎన్నిక

శ్రీనివాస్ ను అభినందించిన సిద్దిపేట డిగ్రీ కళాశాల స్టాప్

సిద్దిపేట  : ముద్ర ప్రతినిధి ప్రతిష్టాత్మక తెలంగాణ అకాడమీ ఆఫ్ సైన్స్ (టాస్) హైదరాబాద్ పరిశోధన, అకాడమిక్ రంగంలో సేవలందించినందుకు సిద్దిపేట డిగ్రీ కళాశాలకు చెందిన కెమిస్ట్రీ విభాగ అధిపతి  డాక్టర్ వాసం శ్రీనివాస్     అసోసియేట్ ఫెలో గా ఎన్నిక అయ్యారు. ప్రతి సంవత్సరం ఫెలోగా, అసోసియేట్ ఫెలో గా, యంగ్ సైంటిస్టులుగా ఎన్నిక కాబడ్డ సభ్యులను  సన్మానించడం చేస్తున్నామని సిద్ధిపేట డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ చలసాని ప్రసాద్ తెలిపారు2021 వ సంవత్సరము గాను సిద్దిపేట గవర్నమెంట్ కళాశాల (అటానమస్ )లో కెమిస్ట్రీ విభాగ అధిపతి అయిన డాక్టర్ వాసం శ్రీనివాస్     అసోసియేట్ ఫెలో గా ఎన్నికయ్యారని ఆయన తెలిపారు.

12 సంవత్సరాల కాలంలో విద్యార్థులకు సేవలందించినందుకు గాను అసోసియేట్ ఫెలో గా శ్రీనివాస్ ఎన్నికైనందుకు కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ సిహెచ్ ప్రసాద్  కళాశాల  అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తూ సోమవారం ఘనంగా సన్మానించడం జరిగింది.ఈ సమావేశంలో కళాశాల వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ కే హుస్సేన్ ,అకాడమీ కోఆర్డినేటర్ డాక్టర్ గోపాల సుదర్శన్, పీజీ కోఆర్డినేటర్ డాక్టర్ పి అయోధ్య రెడ్డి, ఐపిఎస్సి కోఆర్డినేటర్ డాక్టర్ పి మధుసూదన్ అకాడమిక్, కోఆర్డినేటర్ కె భవాని కెమిస్ట్రీ విభాగం అధ్యాపకులు ఆంజనేయులు, డాక్టర్ జి రవికుమార్, డాక్టర్ పి సుమలత ,ఎం  శ్యాంసుందర్, ఎండి సలీం పాషా, వి. బాల కిషన్ తదితరులు పాల్గొన్నారు