బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ...!

బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఈటల రాజేందర్ ...!

ముద్ర,తెలంగాణ:-ఎన్డీయే కూటమి మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేయనున్న తరుణంలో తెలంగాణ నుంచి బండి సంజయ్, కిషన్‌ రెడ్డిలకు కేంద్ర మంత్రి పదవి అవకాశం వచ్చిన సంగతి తెలిసిందే. కిషన్ రెడ్డికి ఈసారి కూడా కేంద్రమంత్రి పదవి రావడంతో బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవి ఎవరికి వస్తుందో అనేదానిపై ఆసక్తి నెలకొంది. ఈ నేపథ్యంలోనే మల్కాజ్‌గిరి నుంచి ఎంపీగా గెలిచిన ఈటల రాజేందర్‌కు ఈ పదవి అప్పగించే అవకాశం ఉందని పార్టీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఈటల రాజేంధర్‌ బీసీ సామాజిక వర్గం, ఉద్యమకారుడు కావడంతో ఆయన వైపు బీజేపీ అధిష్ఠానం మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.