PM Modi Swearing: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

PM Modi Swearing: ముచ్చటగా మూడోసారి ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం

ముద్ర,సెంట్రల్ డెస్క్:-ప్రధానమంత్రిగా నరేంద్ర మోదీ ప్రమాణ స్వీకారం చేశారు. ఆయనతో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రమాణ స్వీకారం చేయించారు. కేంద్ర మంత్రులుగా రాజ్‌నాథ్ సింగ్, అమిత్ షా సహా పలువురు ఎంపీలు ప్రమాణం చేశారు.ఈ కార్యక్రమానికి పలు దేశాల అధినేతలు, భారత్ లోని పలు పార్టీల అధినేతలు కూడా హాజరయ్యారు. ఏపీ నుంచి చంద్రబాబు నాయుడు, పవన్ కల్యాణ్ హాజరయ్యారు. అలాగే, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి

నాయకత్వానికి అసలైన అర్థం చెప్పారు. సమయానుకూల రాజకీయ నిర్ణయాలు తీసుకోవడంలోనూ సిద్దహస్తుడిగా మారారు. ఎన్నికల ప్రచార వ్యూహాలతో ఓట్లు రాబట్టుకోవడంలోనూ, ఫలితానంతర పరిణామాలను అంచనా వేసి..తనకు అనుగుణంగా మార్చుకోవడంలో ఆరితేరారు. అంతిమంగా ఓ చరిత్ర సృష్టిస్తున్నారు. తనకవసరమైనప్పుడు చరిత్రే కొందరిని సృష్టిస్తుందన్న నమ్మకాన్ని కల్పిస్తున్నారు. ఆయనే ప్రధాని మోదీ. జవహర్‌లాల్ నెహ్రూ తర్వాత వరుసగా మూడోసారి ప్రధాని పదవి చేపట్టారు.