బెల్ట్ షాపులో గడువు ముగిసిన కూల్ డ్రింక్ అమ్మకాలు

బెల్ట్ షాపులో గడువు ముగిసిన కూల్ డ్రింక్ అమ్మకాలు

గడువు ముగిసిన కూల్ డ్రింక్ తాగి యువకుడికి అస్వస్థత

మెట్‌పల్లి ముద్ర:- బెల్టు షాపులలో  గడువు ముగిసిన కూల్ డ్రింక్స్ కొనుగోలు చేసి తాగిన యువకుడు అస్వస్థతకు గురైన సంఘటన మెట్‌పల్లి మండలం విట్టంపెట్ లో చోటు చేసుకుంది. బాధితుడు రెండ్ల వెంకటేష్ తెలిపిన వివరాల ప్రకారం బండలింగపూర్ గ్రామానికి చెందిన వెంకటేష్ మెట్లచిట్టపూర్ శివారులో ఉన్న తోటకు వెళ్తుండగా మార్గ మధ్యలో  విట్టంపెట్ లో నిర్వహిస్తున్న బెల్ట్ షాపులో కూల్ డ్రింక్ కొనుగోలు చేశాడు. తోటకు వెళ్లి కూల్ డ్రింక్ తాగిన కొద్ది సమయం తర్వాత వాంతులు అయ్యాయి. దీంతో అక్కడే ఉన్న వెంకటేష్ తండ్రి హుటాహుటిన హాస్పిటల్ తరలించి చికిత్స అందించాడు. కాగా తాగిన కూల్ డ్రింక్ జనవరి నెలలోనే గడువు ముగిసి ఉంది.

ఈ విషయమై బెల్ట్ షాపు యజమాని పై  బాధితుడు గడువు ముగిసిన కూల్ డ్రింక్ అమ్మకాలపై ఆగ్రహం వ్యక్తం చేశారు.దీంతో బెల్ట్ షాపు నిర్వాహకుడు నా ఇష్టం వచ్చినట్లు అమ్ముకుంటాను నీకు దిక్కున్న చోట చెప్పుకో అని సమాధానం ఇచ్చినట్లు బాధితుడు తెలిపాడు. ఈ సంఘటనపై ఫుడ్ సేఫ్టీ అధికారులకు పిర్యాదు చేయనున్నట్లు వెంకటేష్ తెలిపాడు. కాగా బెల్ట్ షాపులు నిర్వహించడం చట్టరీత్య నేరమైన సంబంధిత అధికారులు బెల్ట్ షాపు నిర్వాహకులపై ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు.