సభలో నవ్వులు పూయించిన డిప్యూటీ సీఎం పవన్

సభలో నవ్వులు పూయించిన డిప్యూటీ సీఎం పవన్

 అమరావతి, ముద్రవార్తలు: ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ తొలిసారిగా అసెంబ్లీలో ప్రసంగించారు. ఏకగ్రీవంగా స్పీకర్ గా ఎన్నికైన అయ్యన్నపాత్రుణ్ని అభినందిస్తూ పవన్ కల్యాణ్ చేసిన పలు వ్యాఖ్యలకు అసెంబ్లీలో మిగతా సభ్యుల నుంచి నవ్వులు పూశాయి. ఇన్నాళ్లూ అయ్యన్నపాత్రుడి వాడి వేడీ చూసిన ప్రజానీకం ఇక నుంచి ఆయన హుందాతనాన్ని చూస్తారని అన్నారు. కానీ ఆయనకు తిట్టే అవకాశం లేకపోవడమే బాధేస్తోందంటూ సరదాగా వ్యాఖ్యానించారు. ఇకనుంచి సభలో ఎవరైనా తిట్టినా వాళ్లని అదుపుచేసే బాధ్యత మీపై ఉందని అన్నారు. దీంతో సభలో ఒక్కసారిగా నవ్వులు పూశాయి.