షాద్ నగర్ పట్టణంలో ఘనంగా మాజీ సీఏం కేసీఆర్ జన్మదిన వేడుకలు..

షాద్ నగర్ పట్టణంలో ఘనంగా మాజీ సీఏం కేసీఆర్ జన్మదిన వేడుకలు..
  • బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎం.ఎస్. నటరాజన్ ఆధ్వర్యంలో విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ
  • ముఖ్యఅతిథిగా హాజరైన మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్...

ముద్ర, షాద్ నగర్: అపర భగీరథుడు, రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదిన వేడుకలను షాద్ నగర్ పట్టణంలో ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు ఎం.ఎస్.నటరాజన్ ఆధ్వర్యంలో పట్టణంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా  షాద్ నగర్ మాజీ ఎమ్మెల్యే అంజయ్య యాదవ్ హాజరై విద్యార్థులకు ఎగ్జామ్ ప్యాడ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో తొలి ముఖ్యమంత్రిగా కేసీఆర్ ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాడని, కేసీఆర్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో వర్థిలాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్లు చెట్ల పావని నరసింహా, ప్రేమలత యుగంధర్, చింటూ, పిల్లి శారద శేఖర్, జూపల్లి కౌసల్య శంకర్, మాధురి నంద కిషోర్ నాయకులు సలీం, రవి యాదవ్, నందిగామ శ్రీను, రాఘవేందర్, శివాజీ నాయక్ బీఆర్ఎస్ యువత విభాగం నాయకులు గుండు అశోక్, కొండ మల్లేష్, కావలి అశోక్, కల్పగురి వెంకటేష్, శీలం శ్రీకాంత్, రవి కిరణ్, సుమిత్, గండ్రాతి కిరణ్ తదితరులు పాల్గొన్నారు.