గొంగిడి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.....

గొంగిడి సునీతను అత్యధిక మెజార్టీతో గెలిపించాలి.....
  • ఇంటింటికి వెళ్లి ఓటర్లను కోరుతున్న బిఆర్ఎస్ శ్రేణులు..

ఆలేరు (ముద్ర న్యూస్):ఆలేరు శాసనసభ స్థానానికి బిఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తాజా మాజీ ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్ రెడ్డి కారు గుర్తు పై ఓటు వేసి మూడవసారి అత్యధిక మెజార్టీతో గెలిపించి మంత్రిగా చూసేందుకు నియోజకవర్గ ప్రజలు కృతనిచ్చేయంతో ఉన్నారని ఆలేరు మున్సిపల్ చైర్మన్ వస్పరి శంకరయ్య అన్నారు. సోమవారం నాడు యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మున్సిపల్ కేంద్రంలోని అన్ని వార్డులలో బిఆర్ఎస్ వార్డు కమిటీల ఆధ్వర్యంలో ఇంటింటికి వెళ్లి ఓటర్లను కలిసి రాష్ట్ర ప్రభుత్వం మరియు ఎమ్మెల్యే చేసిన అభివృద్ధి. సంక్షేమ పథకాలను వివరించినట్లు చెప్పారు. రాష్ట్రాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసి. దేశంలోనే నెంబర్ వన్ రాష్ట్రంగా తీర్చిదిద్దిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని అన్నారు. రాష్ట్రంలోని ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలను అందించే ఉద్దేశంతో ఎన్నో వ్యయ. ప్రయోసాలకు ఓర్చి అమలు చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్ కు దక్కుతుందని కొనియాడారు. నియోజకవర్గాన్ని అన్ని రంగాలలో అభివృద్ధి చేసేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తూ నిరంతరం ప్రజల మధ్యలో పనిచేస్తున్న ఎమ్మెల్యే గొంగిడి సునీత మహేందర్రెడ్డి ని మరోసారి ఎమ్మెల్యేగా గెలిపించుకునేందుకు ప్రజలు కృతనిచ్చయంతో ఉన్నారని జోస్యం చెప్పారు. ఈ కార్యక్రమంలో కమిటీ డైరెక్టర్ పత్తి వెంకటేష్. ఆత్మ చైర్మన్ జల్లి నరసింహులు. మున్సిపల్ కౌన్సిలర్ జూకంటి శ్రీకాంత్. బేటి రాములు తో పాటు వార్డు కమిటీల అధ్యక్షులు. నాయకులు. కార్యకర్తలు.  పాల్గొన్నారు.