విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

విద్యార్థులకు గుడ్ న్యూస్.. స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు

ముద్ర,సెంట్రల్ డెస్క్:- ఇరు తెలుగు రాష్ట్రాల్లోని విద్యార్థులకు గుడ్ న్యూస్. ప్రభుత్వ పాఠశాలలకు వరుసగా మూడు రోజులు సెలవులు రానున్నాయి. వచ్చే నెల మార్చిలో ఈ సెలవులు ఉండనున్నాయి. మహాశివరాత్రి పండగను పురస్కరించుకుని మార్చి 08(శుక్రవారం)న సెలవు ఉండనుంది. అదే విధంగా మార్చి 09వ తేదీ రెండో శనివారం సెలవు. కాగా 10వ తేదీ ఆదివారం కావడంతో మూడు రోజులు బడిగంట మూగబోనుంది. ఇక వరుస సెలవులు రానుండడంతో విద్యార్థుల్లో ఆనందం నెలకొంది.

కాగా రెండు ప్రభుత్వాలు విడుదల చేసిన క్యాలెండర్ లో వీటితో పాటు మార్చి నెలలో మరో రెండు రోజులు సెలవులు కూడా రానున్నాయి. మార్చి 25న హోలీ, మార్చి 29న గుడ్ ఫ్రైడే సందర్భంగా కూడా సెలవులు ఉండనున్నాయి. అలాగే ఏప్రిల్ నెలలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా ఏప్రిల్ 5న, ఉగాది సందర్భంగా ఏప్రిల్ 9న, రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న, శ్రీరామనవమి సందర్భంగా ఏప్రిల్ 17న సెలవులు రానున్నాయి.