ఒక్కేసి..పువ్వేసి..చందమామ

ఒక్కేసి..పువ్వేసి..చందమామ
  • ఘనంగా సద్దుల బతుకమ్మ వేడుకలు
  • పాల్గొన్న ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు

మెట్‌పల్లి ముద్ర:- డివిజన్ కేంద్రంలో సద్దుల బతుకమ్మ వేడుకలు వైభవంగా నిర్వహించారు. మహిళలు, యువతులు, చిన్నారులు, అనే తేడా లేకుండా అందరూ బతుకమ్మలను పేరించి వాడవాడలా బతుకమ్మ పాటలు పడుతుండడంతో వీధులన్నీ పూల జాతరను తలపించాయి. ఉదయం నుంచి మహిళలు బతుకమ్మలను పేరుస్తూ కనిపించగా సాయంత్రం లోగిళ్ళన్ని పూల వనాలతో నిండిపోయాయి సాయంత్రం 5 గంటల నుండి వీధులలో బతుకమ్మలను పెట్టి బతుకమ్మ పాటలు, పడుతూ డీజే పాటలకు యువతులు మహిళలు దాండియా నృత్యాలు చేస్తూ బతుకమ్మలను వీధుల్లో ఊరేగించారు. వట్టివాగు, పెద్ద చెరువు, వెల్లుల్లా రోడ్డు లోని ఒర్రె,ఎస్ఆర్ఎస్పీ కెనాల్ లో బతుకమ్మలను నిమజ్జనం చేశారు.  డిఎస్పీ వంగ రవీందర్ రెడ్డి, సీ ఐ లక్ష్మీనారాయణ, ఎస్ ఐ చిరంజీవి ల ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.

 

తెలంగాణ సంస్కృతి కి ప్రతీక..

తెలంగాణ సంస్కృతి కి ప్రతీకగా బతుకమ్మ వేడుకలు నిలుస్తాయని ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావు అన్నారు.ఆయన నివాసంలో ఎమ్మెల్యే సతీమణి పేరించిన బతుకమ్మ ను స్వయానా ఆయనే మోస్తూ ఊరేగింపు నిర్వహించి నిమజ్జనం చేసారు.పలు ప్రాంతాల్లో మహిళలతో కలసి బతుకమ్మ ఆడారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ రానా వేణి సుజాత సత్యనారాయణ, లింగంపల్లి సంజీవ్,  కౌన్సిలర్లు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.