పేద,మధ్యతరగతి ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో

పేద,మధ్యతరగతి ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో
  • మంత్రి జగదీష్ రెడ్డికి మద్దతుగా వార్డ్ వార్డ్ న ప్రచారం నిర్వహిస్తున్న సతీమణి గుంటకండ్ల సునీత జగదీష్ రెడ్డి
  • రాయిని గూడెంలో అభిమాన నేత సతీమణి కి నృత్యాలతో స్వాగతం పలికిన ఆసరా పెన్షన్  లబ్ధిదారులు
  • అవ్వలతో కలిసి నృత్యం చేసి సందడి  చేసిన సునిత జగదీష్ రెడ్డి 

ముద్ర ప్రతినిధి సూర్యాపేట:-పేద,మధ్యతరగతి ప్రజలకు భరోసా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో అని సూర్యాపేట బీఆర్ఎస్ అభ్యర్థి, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి సతీమణి సునిత జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో 11,30 ,10 వ వార్డులో ఇంటింటికి తిరిగి బొట్టు పెడుతూ టిఆర్ఎస్ మేనిఫెస్టో వివరిస్తూ ప్రచారం కొనసాగించారు. రాయని గూడెంలో తమ అభిమాన నేత జగదీశ్ రెడ్డి సతీమణి వస్తున్న విషయం తెలుసుకున్న ఆసరా పెన్షన్ లబ్ధిదారులు తమ వయసును మరిచిపోయి , నృత్యాల తో సునీత జగదీష్  రెడ్డి కి స్వాగతం పలికారు. అమ్మమ్మల ఆనందానికి ఆశ్చర్యపోయిన సునీత జగదీశ్ రెడ్డి వారితో కలిసి నృత్యాలు చేసి సందడి చేశారు. అనంతరం మాట్లాడుతూ ప్రతీ కుటుంభం ఆనందంగా ఉండాలనేదే సీఎం కేసీఆర్, మంత్రి జగదీష్ రెడ్డి గార్ల ఆకాంక్ష అన్నారు.

గతంలో బీఆర్ఎస్ కు వేసిన ఓటు కోట్లాది రూపాయలతో అభివృద్ధి, సంక్షేమ పథకాలు  తీసుకొచ్చిందన్నారు. మరోసారి గెలిపిస్తే కేసీఆర్‌ బీమా ప్రతి ఇంటికి ధీమా, అన్నపూర్ణ పథకం, ఆసరా పెన్షన్‌ 5,016, దివ్యాంగులకు 6 వేల పెన్షన్‌ పెంపు, రైతుబంధు 16 వేలు, ఆగ్రవర్ణ పేదలకు గురుకులాలు, కేసీఆర్‌ ఆరోగ్యరక్షకు రూ. 15 లక్షలు, సౌభాగ్యలక్ష్మి రూ. 3 వేలు మహిళలకు జీవనభృతి, గ్యాస్‌ సిలిండర్‌ రూ. 4వందలకే, మహిళ సమాఖ్యలకు సొంత భవనాలు, నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక సూర్యాపేట లో ముచ్చటగా మూడోసారి గులాబీ జెండా ఎగరడం ఖాయం అన్న సునిత జగదీష్ రెడ్డి ,ప్రచారంలో ప్రజల నుంచి వస్తున్న అపూర్వ స్పందనే దీనికి నిదర్శనం అన్నారు. ఈ నెల 30 న కారు గుర్తుకు ఓటు వేసి భారీ మెజార్టీతో మంత్రి  జగదీష్ రెడ్డి గెలిపించాలని కొరారు.