‘ధమాకా మాస్‌ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ

‘ధమాకా మాస్‌ మహారాజా రవితేజ ఇంటర్వ్యూ
raviteja dhamaka movie interview

మాస్‌ మహారాజా రవితేజ, కమర్షియల్‌ మేకర్‌ త్రినాథరావు నక్కిన మాస్‌ అండ్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ ‘ధమాకా’. రవితేజ సరసన టాలీవుడ్‌ ఫేవరేట్‌ హీరోయిన్‌ శ్రీలీల హీరోయిన్‌ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని టిజి విశ్వ ప్రసాద్‌ భారీగా నిర్మిస్తున్నారు. పీపుల్‌ విూడియా ఫ్యాక్టరీ డ అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ పతాకాలపై రూపొందుతున్న ఈ చిత్రానికి వివేక్‌ కూచిభొట్ల సహ నిర్మాత. ఇప్పటికే విడుదలైన ధమాకా పాటలు, టీజర్‌, ట్రైలర్‌ అద్భుతమైన రెస్పాన్స్‌ తో సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. డిసెంబర్‌ 23న ‘ధమాకా’ ప్రపంచవ్యాప్తంగా థియేటర్లో విడుదలౌతున్న నేపధ్యంలో హీరో రవితేజ విలేఖరుల సమావేశంలో చిత్ర విశేషాలని పంచుకున్నారు.


ధమాకా ప్రమోషన్స్‌ లో కొత్తగా కనిపిస్తున్నారు.. ఫ్యాన్‌ విూట్‌ జరిగింది కదా ?
ఫ్యాన్స్‌ తో కలవడం జరుగుతూనే వుంటుంది. ఫ్యాన్‌ విూట్‌ ని చాలా ఎంజాయ్‌ చేశాను. అన్ని చోట్ల పాజిటివ్‌ గా వుంది. ఆ పాజిటివిటీనే మనల్ని ముందుకు తీసుకెళ్తుంది.


ఏ సినిమా ప్రమోషన్లలోనూ సినిమా గురించి పెద్దగా మాట్లాడరు.. హైప్‌ ఇవ్వరు కదా ?
ఇప్పుడే కాదండీ.. మొదటి నుండి నేనింతే. మనం మాట్లాడకూడదు.. సినిమానే మాట్లాడుతుంది. సినిమా విడుదలైన తర్వాత ఆటోమేటిక్‌ గా సినిమానే మాట్లాడుతుంది కదా.


ధమాకా ఎలాంటి సినిమా ?
ధమాకా మంచి ఎంటర్‌ టైనర్‌. రాజా ది గ్రేట్‌ తర్వాత అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌ టైనర్‌ చేయలేదు. ధమాకా ఫుల్‌ ఎంటర్‌ టైనర్‌. జనాలు బాగా ఎంజాయ్‌ చేస్తారు. 


ఈ మధ్య విూ నుండి సీరియస్‌ సినిమాలు వచ్చాయి కదా ? అటు వైపు వెళ్ళడానికి కారణం ?
అన్నీ ప్రయత్నించాలి కదా. ఫలితం మాట పక్కన పెడితే ప్రయత్నం జరుగుతూనే వుండాలి.


ధమాకాని రౌడీ అల్లుడు తో పోలుస్తున్నారు ?
మా రచయిత ఈ మాట చెప్పి వుంటారు. తెలుగు లో ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమాలు మొదలుపెట్టింది చిరంజీవి గారు. తర్వాత మేమంతా ఫాలో అయ్యాం.  ధమాకా, రౌడీ అల్లుడు లాంటి ఎంటర్‌ టైన్‌ మెంట్‌ సినిమానే. అందులో ఎలాంటి సందేహం లేదు.


ఈ మధ్య కొత్త రచయితలతో ఎక్కువ పని చేస్తున్నారు కదా  ? 
ఈ మధ్య కాదు. ఎప్పటి నుండో వుంది. నాకు కొత్త రచయితలతో పని చేయడం ఇష్టం. వాళ్ళలో ఒక ఆకలి, తపన వుంటుంది. నేను అలా వచ్చినవాడినే కదా.


విూ ఎనర్జీ భీమ్స్‌ కి ఇచ్చినట్లు వున్నారు ?
రెచ్చిపోతున్నాడు.(నవ్వుతూ) ధమాకా ఆల్బమ్‌ ఇరగదీశాడు. తను చాలా మంచి ట్యూన్‌ మేకర్‌. ధమాకా సౌండ్‌ అదిరిపోయింది. అన్నీ పాటలు అద్భుతంగా చేశాడు.


దర్శకుడు త్రినాధరావు నక్కిన గురించి ?
త్రినాథరావు నక్కినతో చాలా సరదాసరదాగా వుంటుంది. తనతో పని చేయడం అందరికీ కంఫర్ట్‌ బుల్‌ గా వుంటుంది. 


త్రినాథరావు విూ అభిమాని కదా..? ఫ్యాన్‌ డైరెక్టర్‌ తో పనిచేసే  సౌలభ్యం వేరుగా ఉంటుందా?
అలాగేం లేదు. తన హీరో ఇలా వుండాలి, ఇలా చూపించాలని ప్రతి దర్శకుడికి వుంటుంది.


రచయిత ప్రసన్న గురించి?
ప్రసన్న అద్భుతంగా రాశాడు. ఈ సినిమా లో డైలాగ్స్‌ చాలా ఎంజాయ్‌ చేస్తారు. ప్రసన్న, త్రినాధరావు కాంబో చక్కగా కుదిరింది. వాళ్ళ కాంబినేషన్‌ లో అన్నీ వర్క్‌ అవుట్‌ అయ్యాయి. ఇదీ అలానే వుంటుంది.


శ్రీలీల పెద్ద స్టార్‌ అవుతుందని చెప్పారు కదా ?
ఖచ్చితంగా పెద్ద స్టార్‌ అవుతుంది. అందం, ప్రతిభ రెండూ వున్నాయి. మంచి డ్యాన్సర్‌, వాయిస్‌, ఎనర్జీ అన్నీ వున్నాయి. పైగా తెలుగమ్మాయి. తప్పకుండా పెద్ద స్టార్‌ అవుతుంది.


కథల ఎంపిక విషయంలో విూ జడ్జ్‌ మెంట్‌ ఎలా వుంటుంది. ?
కథ నచ్చితే ఓకే చేస్తాను. ఇంకాస్త పక్కాగా చేసుకొని రమ్మంటాను. ముందు కథ నచ్చాలి. కథ నచ్చకుండా కాంబినేషన్‌ గురించి చేసే ప్రసక్తే లేదు.