ఇందిరమ్మ రాజ్యం రావాలి

ఇందిరమ్మ రాజ్యం రావాలి
  • మెదక్ ఆత్మగౌరవ యాత్రలో గడప గడపకు కాంగ్రెస్
  • కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే రైతులకు 2 లక్షల రుణమాఫి
  • కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు  తిరుపతిరెడ్డి

ముద్ర ప్రతినిధి, మెదక్:కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు ఏకకాలంలో రెండు లక్షల రూపాయల రుణమాఫిపై మొట్టమొదటి సంతకం చేయనుందని మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి అన్నారు. మంగళవారం పాపన్నపేట మండలంలోని గాంధార్ పల్లి గ్రామంలో  చేపట్టిన ఆత్మగౌరవ యాత్రలో భాగంగా గడప గడపకు, పల్లె పల్లెకు కాంగ్రెస్ కార్యక్రమం ప్రారంభించారు. ప్రతి గడప గడపకు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే చేయనున్న అభివృద్ధి కార్యక్రమాలపై వివరించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే నిరుపేదలకు ఇండ్ల నిర్మాణానికి స్థలాలు ఉంటే ఐదు లక్షల రూపాయాలను కాంగ్రెస్ పార్టీ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు. అలాగే మహిళలకు కర్ణాటక మాదిరిగా ఉచితంగా బస్ ప్రయాణ సౌకర్యం తెలంగాణ రాష్ర్టంలో కల్పిస్తుందన్నారు. ఆసరా ఫించన్ 4 వేల రూపాయలకు పెంచనున్నట్లు తెలిపారు.

మెదక్ నియోజకవర్గంలో ఎమ్మేల్యే చేసింది ఏమి లేదన్నారు. ఏ పల్లెకెళ్ళినా రోడ్లు కూడా సరిగ్గా లేవని ఆయన విమర్శించారు. మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ప్రారంభం. పాపన్నపేట మండల కేంద్రంలో నూతనంగా పార్టీ కార్యాలయాన్ని జిల్లా అధ్యక్షులు తిరుపతి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శశిధర్ రెడ్డిలు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెదక్ నియోజకవర్గంలో కాంగ్రెస్ జెండా ఎగురవేయడమే లక్షంగా ఇద్దరం కలిసి ముందుకు సాగుతామని వారు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో  ప్రభాకర్ రెడ్డి శ్రీకాంతప్ప, గోవింద్ నాయక్, శ్రీనివాస్,సతీష్, విఠలక్షప్ప, శ్రీనివాస్, మహేందర్ రెడ్డి, ఖలిం, ప్రేమ్ రమేష్, శ్రీధర్,  శ్రీకాంత్ రెడ్డి, సంజీవ రెడ్డి, జనార్దన్ రెడ్డి, నర్సింలు, నాగరాజు, జగన్ రెడ్డి సిద్ధ రెడ్డి, శ్రీధర్,సిరాజ్, కిష్టారెడ్డి, మధుసూదన్ రెడ్డి  దావుద్ ఇతరులు పాల్గొన్నారు.

  • కాంగ్రెస్ లో చేరిన మాజీ సర్పంచ్ విట్ఠల్

పాపన్నపేట మండలం గాంధారి పల్లి మాజీ సర్పంచ్  ఎండుగుల విట్ఠల్  బిఆర్ఎస్ పార్టీ నుండి కాంగ్రేస్ పార్టీలో చేరారు. గురువారం గడప గడపకు కాంగ్రెస్ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు కంఠారెడ్డి తిరుపతి రెడ్డి  కండువా వేసి ఆహ్వానించారు.  ఈ సందర్బంగా ఆయన  మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి  మోసపూరిత హామీల నుండి ప్రజలు బయట పడుతున్నారన్నారు.  రాబోయే 2 నెలల్లో నియోజకవర్గంలో బిఆర్ఎస్ పార్టీ నుండి పెద్ద ఎత్తున చేరికలు ఉంటాయని తెలిపారు.